Advertisement
Advertisement
Abn logo
Advertisement

బరువు తగ్గాలంటే..!

ఆంధ్రజ్యోతి(08-04-2021)

బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే ఆహారం పూర్తిగా తగ్గించి ఇతర సమస్యలు కొని తెచ్చుకుంటారు. కానీ నిజానికి కొవ్వును కరిగించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అవేమిటంటే...


ఉదయాన లేవగానే రెండు ఐస్‌ క్యూబ్‌లు తినేయండి. మీరు నమ్మలేనంత ఫ్యాట్‌ తగ్గిపోతుంది. 

వర్కవుట్ల తరువాత ఒక గ్లాసు చల్లని వాటర్‌మెలన్‌ జ్యూస్‌ తాగండి. వాటర్‌మెలన్‌లో అమైనోయాసిడ్స్‌ ఉంటాయి. ఇవి వర్కవుట్‌ తరువాత వచ్చే అలసటను పోగొట్టడానికి, కొవ్వు కరగడానికి బాగా ఉపయోగపడతాయి. 

వేడి వేడి సూప్‌ తీసుకునే కన్నా కొంచెం నీటిని కలిపి తీసుకోవాలి. కొన్ని మిరియాలను ఐస్‌ ట్రేలో వేసుకుని కూడా వాడుకోవచ్చు. 

ఉదయాన్నే కాఫీ వేడి వేడిగా తీసుకునే కన్నా కోల్డ్‌ కాఫీ తీసుకోండి. ఇది కొవ్వును కరిగించే మెకానిజంను ఉత్తేజపరుస్తుంది. చల్లటి పాలలో రెండు ఐస్‌ ముక్కలు వేసుకుని తాగి చూడండి. మంచి ఫలితం కనిపిస్తుంది.

ఐస్‌ట్రేలో పుదీనా ఆకులను చేర్చండి. మరుసటి రోజు మీ కాక్‌టెయిల్‌లో ఆ ఐస్‌ క్యూబ్స్‌ని చేర్చండి. ఈ హెర్బ్‌లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు వ్యాధులు దరిచేరకుండా చూస్తాయి. అంతేకాకుండా కొవ్వు పనిపడతాయి.


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement