అన్ని విధాలా ఆదుకుంటాం

ABN , First Publish Date - 2021-07-23T04:38:13+05:30 IST

నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో నీట మునిగిన ఉజ్జెల్లి పున రావాస కేంద్ర ప్రజలను అన్ని విధాల ఆదుకుంటా మని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

అన్ని విధాలా ఆదుకుంటాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 

పునరావాస గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌ 

మాగనూర్‌, జూలై 22 : నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో నీట మునిగిన ఉజ్జెల్లి పున రావాస కేంద్ర ప్రజలను అన్ని విధాల ఆదుకుంటా మని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పునరావాస గ్రామాన్ని నారాయణ పేట కలెక్టర్‌ హరిచందనతో కలిసి ఎమ్మెల్యే చిట్టెం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పా ఠశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉజ్జయిని పునరావాస కేంద్రానికి సం బంధించిన డబ్బుల విషయమై సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 2005లో ముంపు గ్రామం కోసం ప్రభుత్వం కేటాయించిన పునరావాస కేంద్రం లో ఇళ్లు నిర్మించుకున్న వారికి కొందరికి డబ్బులు రాగా మరికొందరు డబ్బులు తక్కువగా వచ్చాయని, ఈ విషయమై ఉజ్జెల్లి పునరావాస కేంద్రానికి గతంలో ఉన్న కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ను పిలిపించి ఆయన దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అదే విధంగా గతంలో నారాయణపే జిల్లా కలెక్టర్‌గా ఉన్న వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లినా సమస్య సమస్య గానే ఉందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం రొనాల్డ్‌రోస్‌ ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉండ డం వల్ల ఆయనను కలిసి సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తానన్నారు. ఉజ్జెల్లి గ్రామస్థులు కర్ణాటక శివారులో ఉన్నందున ప్రతీ ఒక్కరు కరోనా టీకా వేసుకోవాలని కోరారు. కలెక్టర్‌ హరిచందన మాట్లాడు తూ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం, డ్రెయి నేజీ శుభ్రం చేయుట, పునరావాస కేంద్రంలో మంజూ రైన ప్రభుత్వ పథకాలను వెంటనే ప్రారంభించి ప్రజ లకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్ర మంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ లక్ష్మమ్మ, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, ఎంపీవో జయ పాల్‌రెడ్డి, డీఈఈ ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు.  

Updated Date - 2021-07-23T04:38:13+05:30 IST