సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాం

ABN , First Publish Date - 2020-07-05T11:20:15+05:30 IST

జిల్లాలో సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని చర్యలూ చేపట్టామని జిల్లా సహకారశాఖాధికారి కె.తిరుపాల్‌రెడ్డి

సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాం

సహకార దినోత్సవ సభలో డీసీవో తిరుపాల్‌రెడ్డి


నెల్లూరు(హరనాథపురం), జులై 4 : జిల్లాలో సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని చర్యలూ చేపట్టామని జిల్లా సహకారశాఖాధికారి కె.తిరుపాల్‌రెడ్డి అన్నారు.  అంతర్జాతీయ  సహకారదినోత్సవం సందర్భంగా శనివారం సహకార శాఖ కార్యాలయంలో ఆయన సహకార పతాకాని ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాలు, సహకార బ్యాంకుల ద్వారా రైతులకు ఇతోధికంగా సేవలు అందుతున్నాయన్నారు. నెల్లూరు డివిజన్‌ కోఆపరేటివ్‌ అధికారి పి. శరభయ్య మాట్లాడుతూ వ్యవసాయంలో సహకారం అనుసంధానం  అయిందన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార ఆడిట్‌ అధికారి కే. తిరుపతయ్య,  సహకార విద్యాధికారి జీ.శ్రీనివాసులు సహకారశాఖాధికారులు, సహకార బ్యాంకుల అధికారులు పాల్డొన్నారు.

Updated Date - 2020-07-05T11:20:15+05:30 IST