విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకుంటాం

ABN , First Publish Date - 2021-05-13T05:15:10+05:30 IST

విశాఖ నగరాభివృద్ధికి కీలకమైన ఉక్కు కర్మాగారం ప్రైవేట్‌పరం కాకుండా పరిరక్షించుకుంటామని షిప్‌యార్డ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) అధ్యక్షుడు కె.పెంటారావు అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకుంటాం
దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న నాయకులు

షిప్‌యార్డ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు పెంటారావు 

సిరిపురం, మే 12: విశాఖ నగరాభివృద్ధికి కీలకమైన ఉక్కు కర్మాగారం ప్రైవేట్‌పరం కాకుండా పరిరక్షించుకుంటామని షిప్‌యార్డ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) అధ్యక్షుడు కె.పెంటారావు అన్నారు. విశాఖ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 41వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు ఇప్పటికే నగరంలో ఉన్న అఖిలపక్ష కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, మేధావులంతా ఒకమాట మీదకు వచ్చి పోరాడుతున్నారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తే ఉన్న ఉద్యోగాలు పోవడంతో పాటు కొత్తగా మన ముందు తరాల వారికి ఉపాధి లభించదని పేర్కాన్నారు. అందుకే అందరూ దేశభక్తితో స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంవీ దొర, వరప్రసాద్‌, కనకరాజు, డాక్‌యార్డ్‌ కాంట్రాక్టు వర్కర్స్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-13T05:15:10+05:30 IST