చేనేతకు చేయూతనిస్తాం

ABN , First Publish Date - 2022-08-08T05:28:10+05:30 IST

రాష్ట్రంలో బీజే పీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కార్మికుల నుంచి నేరుగా కొనుగోలు చేసి చేయూతనిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మూ డో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఐదో రోజైన ఆదివారం పోచంపల్లిలో చేనేత కార్మికులతో సమ్మేళనం నిర్వహించారు.

చేనేతకు చేయూతనిస్తాం
భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్‌ నుంచి పాదయాత్రగా వెళ్తున్న బండి సంజయ్‌

బీజేపీ అధికారంలోకి వస్తే నేత వస్త్రాలు కొనుగోలు చేస్తాం

మగ్గాలన్నింటికీ జియో ట్యాగింగ్‌

నేతన్నలకు ఇళ్లు నిర్మిస్తాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 7: రాష్ట్రంలో బీజే పీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కార్మికుల నుంచి నేరుగా కొనుగోలు చేసి చేయూతనిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మూ డో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఐదో రోజైన ఆదివారం పోచంపల్లిలో చేనేత కార్మికులతో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గజాల చీరను అగ్గిపెట్టెలో పట్టేట్టు నేసే నేతన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఇక్కత్‌ చీరలకు పుట్టినిల్లు భూదాన్‌పోచంపల్లి అని, 70 ఏళ్ల క్రితమే ఇక్కత్‌ కళను ప్ర పంచానికి పరిచయం చేసిన కర్నాటి అనంతరాము లు జన్మించిన ప్రాంతమిది అని అన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రముఖ్‌ చక్రాల రామాంజనేయులు పుట్టిన గడ్డ ఇది అన్నారు. భూ దానోద్యమానికి నాంది పలికిన ఆచార్య వినోబాబావే నడయాడిన నేలఅని, ప్రఽథమభూదాత వెదిరె రామచంద్రారెడ్డి పుట్టిన గడ్డఅని,అతి పవిత్రమైన క్షేత్రాన్ని సందర్శించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.


జోరు వానలో పాదయాత్ర

జోరు వానలోనూ సంజయ్‌ పాదయాత్ర ఆదివారం కొనసాగింది. పాదయాత్ర ముక్తాపూర్‌లో ఉదయం 11గంటలకు ప్రారంభమై చింతబావి, ముక్తాపూర్‌, రేవణపల్లి, భూదాన్‌పోచంపల్లి, భీమనపల్లి, జిబ్లక్‌పల్లి మీదుగా సాగింది. పోచంపల్లిలో భూదాన్‌ గంగోత్రి ప్రాంగణంలోని వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రూ రల్‌ టూరిజం సెంటర్‌లోని మ్యూజియాన్ని సందర్శించారు. లీవ్‌టు క్లాత్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించి వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. చేనేత మగ్గంపై కొద్దిసేపు వస్త్రాన్ని నేశారు. దివ్యాంగుడైన గొట్టిముక్కుల రమేష్‌ ఇంటిని సందర్శించి అతడి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన రమేష్‌ కృత్రిమ కాళ్లతో మగ్గాన్ని నేయడా న్ని చూసి చలించారు. అనంతరం పాదయాత్రలో ప్రజా సమస్యలు వింటూ భరోసా కల్పిస్తూ ముం దుకు సాగారు. పాదయాత్ర 13కి.మీ మేర సాగిం ది. వర్షంలోనూ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఎదురేగి సంజయ్‌కు స్వాగతం పలికారు. రాష్ట్ర పవర్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు సంజయ్‌ ను కలిసి కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. జిబ్లక్‌పల్లి సమీపంలో సంజయ్‌ రాత్రి బస చేశారు.


చేనేతను అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్‌

అప్పులిచ్చే చేనేతలు అప్పుల ఊబిలోకి సీఎం కేసీఆర్‌ నెట్టారని బండి సంజయ్‌ అన్నారు. చేనేత సం క్షోభం కారణంగా రాష్ట్రంలో సుమారు 360మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఎన్నికలొస్తే అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌తోపాటు పీవీ నరసింహారావు ఆయనకు గుర్తొస్తారని, ఎన్నికలు కాగా నే హామీలను గాలికొదిలేసే నయవంచక అవకాశవాది కేసీఆర్‌ అని అన్నారు. జయశంకర్‌సార్‌ బతికి ఉన్నప్పుడు అడుగడుగునా అవమానించినవా లే దా? పరోక్షంగా ఆయన చావుకు కారకుడివి కాదా? అని ప్రశ్నించారు. చేనేత సమాజం కేసీఆర్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.నేత కార్మికులకు రూ. 15వేల కనీస వేతనం, సబ్సిడీపై నూలు దారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనావస్థలో ఉన్న దివ్యాంగుడైన రమేష్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రూ.100 కోట్లతో మిత్ర పథకాన్ని తెస్తానని మాటతప్పిన మూర్ఖుడు కేసీఆర్‌ అని అన్నారు. చేనేత బీమా ఏడాది క్రితం ప్రకటించగా, ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పోచంపల్లిలో సభ పెడుతున్నానని తెలిసి అమలు చేస్తున్నట్లు సీ ఎం ప్రకటించాడని ఎద్దేవా చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించి చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నరేంద్రమోదీకే దక్కిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మగ్గాలన్నింటికీ జియోట్యాగింగ్‌ చేస్తామన్నారు. నేతన్నలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు డబ్బులిస్తే ప్రజలు ఓట్లేస్తారని విర్రవీగుతు న్న కేసీఆర్‌ను తరిమికొడదామని పిలుపునిచ్చారు. బీజేపీ ఆద్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆలె భాస్కర్‌, గొంగిడి మనోహర్‌రెడ్డి, వెదిరె శ్రీరాం, వన్నాల శ్రీరాములు, పీవీ.శ్యాంసుందర్‌రావు, వీరెల్లి చంద్రశేఖర్‌, జిట్టా బాలకృష్ణారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, నరోత్తంరెడ్డి, నాగూరాం నామోజీ, నందకుమార్‌, పాశం భాస్కర్‌, చింతల రామకృష్ణ, పోతంశెట్టి రవీందర్‌, డి.లక్ష్మీనారాయణ, కర్నాటి ధనుంజయ, ఎన్నం శివకుమార్‌, మేకల చొక్కారెడ్డి, దోర్నాల సత్యం, చిక్క కృష్ణా, నోముల గణేష్‌, కేసారం కృష్ణారెడ్డి, బండిరాల సుశీల, కొమ్ము భానుచందర్‌ తదితరులు పాల్గొన్నారు.


నేటి యాత్ర ఇలా..

ప్రజా సంగ్రామ యాత్ర ఆరో రోజు సోమవారం చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెంలో ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి శేరిల్ల, పెద్దకొండూరు, చిన్నకొండూరు, చౌటుప్పల్‌ మునిసిపాలిటీ, తాళ్లసింగారం క్రాస్‌రోడ్‌ వరకు మొత్తం 13.8కి.మీ మేర సంజయ్‌ పాదయాత్ర కొనసాగనుంది.రం 35.8 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీట్టిమట్టం 36అడుగులు(2.4 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 35.8అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 400క్యూసెక్కు లు కాగా, ఔట్‌ఫ్లో 150క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2022-08-08T05:28:10+05:30 IST