అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం

ABN , First Publish Date - 2022-05-29T05:53:20+05:30 IST

అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం

అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం
రచ్చబండలో మాట్లాడుతూన్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌


  • రైతులు ఎవ్వరు బ్యాంకుల్లో రుణాలు చెల్లించొద్దు
  • రచ్చబండలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌

బంట్వారం మే28: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో  ఏకకాలంలో  రైతు రుణమాఫీ చేస్తామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. శనివారం తోర్మామిడి గ్రామంలో రచ్చబండ, వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వికారాబాద్‌ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడోద్దన్నారు. ఇప్పటి నుంచి ఒక్క రైతు కూడా బ్యాంకుల్లో రుణాలు చెల్లించొద్దన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ధరణి  సమస్యతో  రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి ఎత్తి వేస్తామన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటున్నా.. అని చెప్పుకునే ఎమ్మెల్యే ఆనంద్‌ వికారాబాద్‌ నియోజకవర్గంలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేయకపోవడం విడ్డురమని మండిపడ్దారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో  కాంగ్రెస్‌ హయంలోనే జరిగిన పనులే కనిపిస్తున్నాయని  అన్నారు.  కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం, చామల రఘుపతి రెడ్డి, జడ్పీటీసీ సంతోష, శ్రీనివా్‌సరెడ్డి, తౌఫిక్‌పాషా ,శ్రీకాంత్‌, మొగులయ్య, సంగమేశ్వర్‌,  కృష్ణ, వీరేశం, శాకం రాములు, సుదర్శన్‌, శాకం నర్సింహులు,రంగారెడ్డి, శంకర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:53:20+05:30 IST