నిర్వాసితులకు అండగా నిలుస్తాం

ABN , First Publish Date - 2021-07-26T04:21:14+05:30 IST

నిర్వాసితులకు అం డగా ఉంటామని ఎవరు అధైర్య పడొద్దని వ్యవసా య శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

నిర్వాసితులకు అండగా నిలుస్తాం
ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌ నిర్మాణా నికి శంకు స్థాపన చేస్తున్న మంత్రి

వనపర్తి అర్బన్‌, జూలై 25: నిర్వాసితులకు అం డగా ఉంటామని ఎవరు అధైర్య పడొద్దని వ్యవసా య శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రేవల్లి మండలం బండరావిపాకులలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మి స్తున్న ఏదుల రిజర్వాయర్‌లో ముంపునకు గురవు తున్న బండరావిపాకుల గ్రామస్థుల కోసం గౌరీ దే విపల్లి సమీపంలో ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌ నిర్మాణా నికి ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి శంకు స్థాపన చేశారు. బండరావిపాకులలో ప్రజలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు బడి,గుడి, పార్కు, పంచాయతీ భవనం, కరెంటు, నీళ్లు సకల వసతులను కల్పిస్తామన్నారు. రేపటి నుంచి గౌరిదే విపల్లి సమీపంలో కేటాయించిన ప్లాట్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. బండరావిపాకులలో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులను తరలించుకోవాలని సూచిం చారు. ముంపు గ్రామాల్లో సర్వం కోల్పోయిన ప్రజ లకు భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ప్రభభుత్వ పథకాలలో బ్యాంకు గ్యారంటీ లేకుండా లోన్ల సదుపాయం క ల్పిస్తామన్నారు. ఏదుల రిజర్వాయర్‌ ముంపు గ్రా మాల ప్రజలకు చేపల మీద హక్కులు కల్పించేం దుకు కృషి చేస్తామన్నారు. సీఎం నియోజకవర్గం లో ప్రాజెక్టుల ముంపులో ఎంత పరిహారం ఇస్తు న్నారో ఇక్కడా అంతే ఇస్తున్నామన్నారు. ఎంపీ   రాములు మాట్లాడుతూ నిర్వాసితుల త్యాగానికి పా దాభివందనం అన్నారు. నిర్వాసితులకు అండగా నిలుస్తామని, ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. నిర్మాణ పనులను స్వ యంగా పర్యవేక్షిస్తానని, తనవంతుగా గ్రామ నిర్మా ణానికి ఎంపీ నిధులు కేటాయిస్తామని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరా జు, మర్రి జనార్దన్‌రెడ్డి, భీరం హర్షవర్ధ్దన్‌రెడ్డి, ఎమ్మె ల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, ఆర్డీవో అమరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-26T04:21:14+05:30 IST