త్యాగధనుల ఆశయస్ఫూర్తితో మెదలాలి

ABN , First Publish Date - 2022-08-14T05:14:09+05:30 IST

స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేసిన త్యాగధనుల ఆశయస్ఫూర్తితో యువత, విద్యార్థులు ఉత్తములుగా ఎదిగి దేశ ఔన్నత్యం కోసం పాటుపడాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

త్యాగధనుల ఆశయస్ఫూర్తితో మెదలాలి
చేర్యాలలో పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, ఆగస్టు 13: స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేసిన త్యాగధనుల ఆశయస్ఫూర్తితో యువత, విద్యార్థులు ఉత్తములుగా ఎదిగి దేశ ఔన్నత్యం కోసం పాటుపడాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం చేర్యాలలో అంగడిబజారు నుంచి గుంటూరుపల్లి కాలనీ వరకు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, వర్తక వ్యాపార సంఘాల ప్రతినిధులతో కలిపి చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి పాల్గొన్నారు. అలాగే చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలో సర్పంచ్‌ కృష్ణవేణి, ఎంపీటీసీ  బాలరాజు ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 50 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబూని నినాదాలు చేశారు. మర్రిముచ్ఛాలలో సర్పంచ్‌ పద్మ, రాంసాగర్‌లో సర్పంచ్‌ రవీందర్‌ ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించారు. రసూలాబాద్‌లో సర్పంచ్‌ స్వామి ఆధ్వర్యంలో మూడురంగుల బెలూన్లు, జాతీయ జెండాల ప్రదర్శనతో ర్యాలీ చేపట్టారు.

రాయపోల్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా రాయపోల్‌లో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రాథమిక పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది. ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలను ఎమ్మెల్యే తిలకించారు. మండలంలోని చిన్నమాసాన్‌పల్లి, లింగారెడ్డిపల్లి, కొత్తపల్లిలో పర్యటించారు. 

గజ్వేల్‌: స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన వారి చరిత్రను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్‌ పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయం నుంచి కొండాలక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం వరకు, అక్కడి నుంచి ఇందిపార్కు చౌరస్తా వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి పాల్గొన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని పోలీ్‌సస్టేషన్‌లో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులతో గజ్వేల్‌ ఏసీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి మల్లెచెట్టు చౌరస్తా మీదుగా అంబేడ్కర్‌ చౌరస్తా వరకు మువ్వన్నెల జెండాలను చేబూని ర్యాలీ జరిపారు. హుస్నాబాద్‌ రేణుకాఎల్లమ్మ ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది పట్టణంలో అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. హుస్నాబాద్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో వ్యాసరచన, ఉపన్యాస పోటీలతో పాటు సంగీత కార్యక్రమాలు జరిపారు. విద్యార్థులు భారత దేశ ఆకృతిలో నిలిచిన ప్రదర్శన ఆకట్టుకున్నది. 

అక్కన్నపేట/హుస్నాబాద్‌ రూరల్‌: అక్కన్నపేట మండలంలో 75వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. అలాగే హుస్నాబాద్‌ మండలం పోతారం (ఎస్‌) గ్రామంలోని కేజీ నుంచి పీజీ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలనియం నుంచి 200 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. 

జగదేవ్‌పూర్‌: జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో శనివారం ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జగదేవ్‌పూర్‌ ఎల్లమ్మ ఆలయం నుంచి పోలీ్‌సస్టేషన్‌ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో మాస్టర్‌ మైండ్‌ స్కూల్‌ విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాను ఊరేగించారు. అలాగే జగదేవ్‌పూర్‌లో బీజేపీ నాయకులు పూలమాలవేసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  

వర్గల్‌: వర్గల్‌ మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు ఫ్రీడ్‌ రన్‌ నిర్వహించారు. 

ములుగు: జాతీయ జెండా పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కుక్కల నరే్‌షగౌడ్‌ అన్నారు. శనివారం ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. 

కోహెడ: కోహెడ మండలంలోని మండల పరిషత్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక గురుకుల పాఠశాలలో క్రీడా పోటీలు ప్రారంభించారు. 

కొండపాక: కొండపాక మండలం దుద్దెడలో శనివారం సర్పంచ్‌ ఆరేపల్లి మహదేవ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 

దుబ్బాక/మిరుదొడ్డి: దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో తిరంగా ర్యాలీని శనివారం నిర్వహించారు. దుబ్బాక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితాభూంరెడ్డి, మిరుదొడ్డి ఎంపీపీ సాయాలు పాల్గొన్నారు. అనంతరం దుబ్బాకలో మూడురంగుల బెలూన్స్‌ను సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఊది గాలిలో వదిలేశారు. మిరుదొడ్డిలో గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలవేశారు. నూతనంగా ఏర్పాటుకానున్న అక్బర్‌పేటభూంపల్లి మండల ఎస్‌ఐ హరీశ్‌ ఆధ్వర్యంలో తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

తొగుట: తొగుట మండలంలోని వివిధ గ్రామాల్లో హర్‌ గర్‌ తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు. 

నారాయణరావుపేట/సిద్దిపేట రూరల్‌: నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. గుర్రాలగొందిలో సర్పంచ్‌ ఆంజనేయులు, ఎంపీటీసీ ఆకుల హరీశ్‌ ఆధ్వర్యంలో 200 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించి ర్యాలీ నిర్వహించారు. 

బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాల సభ్యులు, విద్యార్థులు అంబేడ్కర్‌ కూడలి నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల వరకు ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. 

చిన్నకోడూరు: చిన్నకోడూరు మండల కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి, గాలిలోకి బెలూన్లు ఎగురవేసి, నినాదాలు చేశారు. 

15 నుంచి ఫ్రీడమ్‌ కప్‌ పోటీలు 

సిద్దిపేట క్రైం, ఆగస్టు 13: సిద్దిపేట కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న  పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఫ్రీడమ్‌ కప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీపీ శ్వేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, డివిజన్లవారీగా సిద్దిపేట ఏఆర్‌, కమిషనర్‌ కార్యాలయ సిబ్బందితో టీమ్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు క్రికెట్‌, వాలీబాల్‌, షటిల్‌, టగ్గఫర్‌, 5కే రన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని సీపీ తెలిపారు.



Updated Date - 2022-08-14T05:14:09+05:30 IST