ప్రైవేట్‌ వైద్యులు, నర్సుల సేవలు గుర్తిస్తాం

ABN , First Publish Date - 2020-04-10T11:01:02+05:30 IST

కోవి డ్‌-19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పనిచేస్తున్న ప్రైవేట్‌ వైద్యులు, నర్సుల సేవలను గుర్తిస్తామని రాష్ట్ర బీసీ

ప్రైవేట్‌ వైద్యులు, నర్సుల సేవలు గుర్తిస్తాం

కోవిడ్‌ వారియర్స్‌గా ప్రభుత్వ  రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత

మంత్రి శంకరనారాయణ


అనంతపురం, ఏప్రిల్‌9 (ఆంధ్రజ్యోతి) : కోవి డ్‌-19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పనిచేస్తున్న ప్రైవేట్‌ వైద్యులు, నర్సుల సేవలను గుర్తిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. కోవి డ్‌ వారియర్స్‌గా వారికి ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లలో అ త్యధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఆయన ప్రైవేట్‌ వైద్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ అధ్యక్షతన జరిగి న సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. ప్రపం చ విపత్తుగా కోవిడ్‌-19 మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్ర జలను రక్షించేందుకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశా లు ఇచ్చారన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ప్రైవేట్‌ వై ద్యులు సేవలందిస్తున్నారని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ముందుండాలని సూచించారు.


జిల్లా వైద్యఆరోగ్యశాఖతో కలిసి కోవిడ్‌-19 వ్యాధిగ్రస్తులకు సేవలందించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్న, ఆ లక్షణాలతో బాధపడుతున్న రోగులకు చికిత్సలందించేందుకు ప్రభుత్వ వైద్యులతో కలిసి ప్రైవేట్‌ సెక్టార్‌ నుంచి ఎంత మంది ఈఎన్‌టీ, చెస్ట్‌ ఫిజీషియన్లు, జనరల్‌ మెడిసిన్‌ అవసరమో తెలపాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. వైద్యసేవలందించేందుకు అంగీకరించిన ప్రై వేట్‌ వైద్యులకు వసతి కల్పించేందుకు ఒక ప్రత్యేక హోటల్‌లో 45 రూములను సిద్ధంగా ఉంచామన్నారు. వైద్యసేవలందించే ప్రైవేట్‌ వైద్యుల జీవితాలకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల బీమా సౌకర్యం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు సంబంధించిన లింకును ప్రైవేట్‌ వైద్యులకు పంపాలని డీఎంహెచ్‌ఓను ఆయన ఆదేశించారు. జిల్లాలో 1932 పీపీఈలు, 15 వేల ఎన్‌-95 మా స్క్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.


వీటితో పాటు మరో 600 పీపీఈలు గురువారం వచ్చాయన్నారు. అ దనంగా మరో 5 వేల పీపీఈలకు ఆర్డర్‌ చేశామన్నా రు. ఈ నేపథ్యంలో వైద్యుల భద్రతపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. ఎస్పీ సత్యఏసుబాబు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వచ్చే ప్రతి కేసును కోవిడ్‌-19 కేసుగానే భావించి జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యసేవలందించాలని ఆయన వైద్యులకు సూచించారు. ఇదే సందర్భం లో ఐఎంఏ, ఆప్నా సంఘం ప్రతినిధులు జిల్లా యం త్రాంగానికి తమవంతు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


పలువురు ఈఎన్‌టీ, చెస్ట్‌ ఫిజీషి య న్లు, జనరల్‌ వైద్యులు కూడా ముందుకొచ్చారు. సమా వేశంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జేసీ ఢిల్లీరావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీసీహెచ్‌ఎ్‌స డాక్ట ర్‌ రమే్‌షనాథ్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీరజ పాల్గొన్నారు.


Updated Date - 2020-04-10T11:01:02+05:30 IST