ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-05-27T06:54:24+05:30 IST

పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. కొండమల్లేపల్లిలో వాసవీమాత క ల్యాణ మండలంలో రూ.6లక్షల విలువచేసే 32 సీసీ కెమెరాల ప్రారంభం అనంతరం చిం తపల్లి పోలీ్‌సస్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
కొండమల్లేపల్లి వాసవీమాత కల్యాణమండపంలో సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న ఎస్పీ

ఎస్పీ రెమారాజేశ్వరి 

చింతపల్లి, కొండమల్లేపల్లి, మే 26: పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. కొండమల్లేపల్లిలో వాసవీమాత క ల్యాణ మండలంలో రూ.6లక్షల విలువచేసే 32 సీసీ కెమెరాల ప్రారంభం అనంతరం చిం తపల్లి పోలీ్‌సస్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ, జిల్లాలోని ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దొంగతనాల నివారణకు అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే పేద ప్రజలను గౌరవించడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌లో సిబ్బంది కొరత ఉండ గా, త్వరలో కొంతమంది సిబ్బందిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఫర్టిలైజర్స్‌, వస్త్రవ్యాపారులు, కిరాణా మర్చంట్‌, ప్రైవేట్‌ వైద్యశాలలు, మెడికల్‌ దుకాణాలు, సెల్‌ఫోన్‌ షాపుల యజమానులు సన్మానించారు. కార్యక్రమాల్లో డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐలు శంకర్‌రెడ్డి, రవీందర్‌, ఎస్‌ఐ నారాయణరెడ్డి, ఇన్‌చార్జి ఏఎ్‌సఐ భిక్షమ య్య, నాయకులు కాసర్ల వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీరాములు, కేసాని లింగారెడ్డి, కుంభం శ్రీనివా్‌సగౌడ్‌, రమావత్‌  దస్రునాయక్‌, యుగేంధర్‌రెడ్డి, సురేష్‌, పాండు, పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T06:54:24+05:30 IST