అందరూ మెచ్చేలా మెడికల్‌ కళాశాల నిర్మించాలి

ABN , First Publish Date - 2021-07-31T05:59:49+05:30 IST

భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్‌ కళాశాలను అందరూ మె చ్చే విధంగా నిర్మించేలా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ జీ వన్‌రెడ్డి అన్నారు.

అందరూ మెచ్చేలా మెడికల్‌ కళాశాల నిర్మించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

స్థలం కేటాయింపు విషయంలో కమిటీ వేయాలి

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, జూలై 30 : భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని  జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్‌ కళాశాలను అందరూ మె చ్చే విధంగా నిర్మించేలా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ జీ వన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన నివాసంలో విలేక రుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. జగిత్యాల పట్టణం జిల్లా కేం ద్రంగా మారడంతో విద్య, వైద్య సదుపాయల కల్పనలో భాగంగా మెడి కల్‌ కళాశాలను మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ని రుపేదలకు వైద్య సదుపాయం కల్పించడంలో ప్రభుత్వం ప్రధాన పా త్ర పోషించాలన్నారు. జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలతో పాటు సూ పర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలు ఒకే చోట 60 ఎకరాల స్థలం అ ణువుగా ఉన్న చల్‌గల్‌ వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంలో ఏర్పాటు చేస్తే భవిష్యత్‌ తరాలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. జగిత్యాల పట్టణంలో ఉన్న ధరూర్‌ క్యాంపు, చల్‌గల్‌లో ఉన్న వ్యవసాయ ప్రదర్శ నా క్షేత్రంలో ఉన్న ప్రభుత్వ భూమి ఏ మేరకు అణువుగా ఉంటుందో అనే నివేదికను సీఎం కేసీఆర్‌ తెప్పించుకుని నిర్ణయం తీసుకోవాలన్నా రు. ప్రభుత్వం మెడికల్‌ కళాశాల నిర్మాణ విషయంలో ఓ అధికారిని ని యమించి కమిటీ వేసి అభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకోవాల న్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్‌ కళాశాలను తాత్కాలికం గా ధరూర్‌ క్యాంపులో కొనసాగించాలని, పక్కా నిర్మాణం విషయంలో 60 ఎకరాలకు పైగా అణువైన స్థలం ఉన్న చల్‌గల్‌లో నిర్మాణం చేపట్టా లన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, నాయకులు కల్లెపల్లి దుర్గయ్య, జగధీశ్వర్‌, నందయ్య, జీవన్‌, రాధకిషన్‌ రావు, డాక్టర్‌ చాంద్‌ పాష, బీరం రాజేష్‌, హరీష్‌, రఘవీర్‌ ఉన్నారు.

Updated Date - 2021-07-31T05:59:49+05:30 IST