తెలంగాణాకు మేము పట్టేదారులం

ABN , First Publish Date - 2022-09-28T05:35:00+05:30 IST

‘తెలంగాణాకు మేమే పట్టాదారులం... తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ నాయకులు, ఆంధ్రపాలకుల మోచేతీ నీళ్లు తాగి తెలంగాణాకు ద్రోహం చేసిన మీరు తెలంగాణ బినామీలు... వినోద్‌కుమార్‌ నాన్‌ లోకల్‌ అంటూ పదేపదే మాట్లాడుతున్న నీవు ముందు మీ అధినేత సోనియాగాంధీ లోకలా, నాన్‌ లోకలా.... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎంపీగా ఎక్కడ గెలిచాడు.. ఎమ్మెల్యేగా ఎక్కడ పోటీచేశాడు... ఆయన లోకలా...నాన్‌ లోకలా చెప్పాలి’ అంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణాకు మేము పట్టేదారులం
సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు

- ఎంపీగా ఏం చేశావో చెప్పు

- జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ మార్చాల్సిన అవసరం లేదు...

- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ ధ్వజం


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 27: ‘తెలంగాణాకు మేమే పట్టాదారులం... తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ నాయకులు, ఆంధ్రపాలకుల మోచేతీ నీళ్లు తాగి తెలంగాణాకు ద్రోహం చేసిన మీరు తెలంగాణ బినామీలు... వినోద్‌కుమార్‌ నాన్‌ లోకల్‌ అంటూ పదేపదే మాట్లాడుతున్న నీవు ముందు మీ అధినేత సోనియాగాంధీ లోకలా, నాన్‌ లోకలా.... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎంపీగా ఎక్కడ గెలిచాడు.. ఎమ్మెల్యేగా ఎక్కడ పోటీచేశాడు... ఆయన లోకలా...నాన్‌ లోకలా చెప్పాలి’ అంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌పై పొన్నం ప్రభాకర్‌ చేసిన వాఖ్యలను ఆయన ఖండించారు. వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అవుడేటెడ్‌ లీడర్‌ అని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వినోద్‌కుమార్‌పై నిరాధారమైన, అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కరీంనగర్‌ ఎంపీగా, పార్లమెంట్‌ సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా ఉన్న పొన్న ప్రభాకర్‌ జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ చేసిందేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వినోద్‌కుమార్‌ ఏం చేశారో తాము చెబుతామని, బహిరంగ చర్చకు రావాలని పొన్నంకు సవాల్‌ విసిరారు. ఎంపీగా పొన్నం కేవలం ఒక జాతీయరహదారి కోసం ప్రతిపాదనలు పంపిస్తే, ఆ రహదారి పనులు పూర్తిచేయించిన ఘనత వినోద్‌కుమార్‌ది అని అన్నారు. ఆనాటి కేంద్ర రహదారులశాఖ మంత్రి జాతీయ రహదారులకు  బైపాస్‌ రోడ్లు ఉంటే ప్రజలకు ఇబ్బందులుండవని  సూచించారన్నారు. ఆ మేరకే జాతీయ రహదారికి బైపాస్‌ అలైన్‌మెంట్‌ రూపొందించారని, వినోద్‌కుమార్‌ ప్రతిమ మెడికల్‌ కళాశాల కోసం అలైన్‌మెంట్‌ మార్చలేదన్నారు. వైఎస్‌ హయాంలో పొన్నం భూములకు విలువ పెరిగేందుకు బైపాస్‌ రోడ్డు వేయించుకున్నాడని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకముందే కాంగ్రెస్‌ పాలనలోనే వినోద్‌ తీగల వంతెన మంజూరు చేయించారని, పదేళ్ళుగా ప్రజాక్షేత్రానికి దూరంగా ఉన్న పొన్నం వాస్తవాలు తెలియకుంటే తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారిపట్టించే ప్రయత్నాలను మానుకోవాలని, నీలాటి వారితోనే కాంగ్రెస్‌ పార్టీ కనుమరగువుతోందని, ఇప్పటికే కాంగ్రెస్‌కు దేశంలో, రాష్ట్రంలో కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వినోద్‌కుమార్‌ను టార్గెట్‌ చేసి అసత్యపు నిందారోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. జడ్పీ మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు జమీలొద్దీన్‌ మాట్లాడుతూ నేషనల్‌ హైవే అథార్టీ నిబంధనల ప్రకారంగానే జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. వరంగల్‌ నుంచి గంగాధర వరకు పలుచోట్ల ప్రజలకు ఇబ్బందికావద్దని బైపాస్‌ రోడ్లు వేసేందుకు నోటిఫికేషన్‌ ఇస్తే ఇన్నాళ్ళు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో సుడా డైరెక్టర్లు నేతి రవివర్మ, వంగల రవీందర్‌, వొల్లాల శ్రీను, మారుతి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:35:00+05:30 IST