YSRCP దౌర్జన్యాలకు భయపడొద్దు.. అండగా ఉంటాం.. : నారా లోకేష్ భరోసా

ABN , First Publish Date - 2021-08-06T14:50:12+05:30 IST

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రారంభమైన..

YSRCP దౌర్జన్యాలకు భయపడొద్దు.. అండగా ఉంటాం.. : నారా లోకేష్ భరోసా

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రారంభమైన టీడీపీపై దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తూనే ఉన్నారు. తాజాగా.. అనంతపురం జిల్లా రామగిరి మండలం మాదాపురంకు చెందిన టీడీపీ వర్గీయులపై దాడి జరిగింది.! ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పార్టీ వర్గీయులకు ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. వైసీపీ దౌర్జన్యాలకు ఎవరూ భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.


అసలేం జరిగింది..!?

కాగా.. మూడు రోజుల క్రితం టీడీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ గంగమ్మ గదిలో (గ్రామ సచివాలయంలో) ఫర్నీచర్‌ను వైసీపీ వర్గీయులు ధ్వంసం చేసిన విషయం విదితమే. వైసీపీ నేతల తీరును నిరసిస్తూ గ్రామ సచివాలయం ముందు టీడీపీ వర్గీయులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో వారిపై వైసీపీ వర్గీయులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేశారు. అయితే మూడు రోజులు కావస్తున్నా వారిని పోలీసులు కోర్టుకు హాజరుపరచలేదు. పోలీసుల తీరును మాజీ మంత్రి పరిటాల సునీత.. నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పార్టీ వర్గీయులకు ఫోన్ చేసి భరోసా ఇచ్చారు.

Updated Date - 2021-08-06T14:50:12+05:30 IST