మేము సైతం..

ABN , First Publish Date - 2021-03-08T05:38:45+05:30 IST

ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోనూ ఉండేది. కానీ నేడు ఎందులోనూ తీసిపోమంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళామణులు. పలురంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భు తాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు.

మేము సైతం..

పలు రంగాల్లో దూసుకెళ్తున్న మహిళామణులు

పురుషులతో సమానంగా రాణింపు

అమలుకు నోచుకోని మహిళా చట్టాలు

ఆగని వేధింపులు.. కొనసాగుతున్న వివక్ష

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఆదిలాబాద్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోనూ ఉండేది. కానీ నేడు ఎందులోనూ తీసిపోమంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళామణులు. పలురంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భు తాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు. లాలించే అమ్మగా... ప్రేమించే ప్రియురాలిగా.. అప్యాయతను పంచే సోదరిగా... ఇలా అనేక పాత్రలు పోషిస్తూ అప్యాయత అనురాగాలను పంచుతున్నారు. అందివచ్చిన అవకా శాలను ఆయుధంగా మల్చుకొని ఆకాశమే హద్దుగా... అన్నింటా ముందుగా నిలుస్తున్నారు మహిళలు. ఇప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ మహిళలపై వేధిం పులు పెరిగిపోతున్నా మహళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం లేదు. తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఆడ పిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కానీ ఈ ఒక్క రోజైనా తమను గుర్తించాలని ఆరాట పడుతోంది మహిళా లోకం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2021-03-08T05:38:45+05:30 IST