Abn logo
Jul 31 2021 @ 01:16AM

పన్నుల వసూళ్లతోనే అభివృద్ధికి బాటలు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి

పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

వలేటివారిపాలెం, జూలై 30 : పంచాయతీల్లో సక్రమంగా పన్నులు వసూలు చేస్తేనే అభివృద్ధికి బాటలు పడతాయని ఎమ్మెల్యే మాను గుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయి అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., చెత్తసంపదకేంద్రాలు వినియోగం, తాగునీరు, వీధిదీపాల మరమ్మతులపై  కార్యదర్శుల నుండి నివేదికలు తీసుకున్నారు. నూరుశాతం పన్నులు వసూలు చేయాల  న్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే జిల్లా పంచాయతీ అదికారి, కలెక్టర్‌కు నివేదించనున్నట్లు తెలిపారు. మేజర్‌ పంచాయతీ వలేటివారిపాలెంలో 25 శాతం టాక్స్‌, 0 శాతం నాన్‌టాక్స్‌ వసూలుపై ఆ పంచాయతీ కార్యదర్శి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఫీద్‌ అహ్మద్‌ ఈవోఆర్డీ సుమంత్‌, ఎస్‌ఐ సుదర్శన్‌, పీఆర్‌ ఏఈ గోపిచంద్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రవిచంద్ర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

భూ సర్వేతో రెవెన్యూ సమస్యలకు చెక్‌

రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా చేపట్టనున్న జగనన్న శాశ్వత భూహక్కు సర్వేతో భూ అక్రమాలకు చెక్‌ పడుతుందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం భూ సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలో రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. రికార్డులలో ఒకరు, ఆన్‌లైన్‌లో మరొకరు, సాగులో మరొకరు ఉన్నారన్నారు. ఒకట్రెండు గ్రామాలలో సర్వే నెంబర్లు సైతం మాయమైనట్లు తెలిపారు. మాయమైన సర్వేనెంబర్లు సంగతి ఏమిటని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. త్వరలో సమావేశం కానున్న అసైన్‌మెంట్‌ కమిటీకి అర్హుల జాబితా తయారుచేసి సిద్ధంగా ఉంచాలని తహసీల్దార్‌కు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సయ్యద్‌ ముజిపర్‌ రెహ్మన్‌, ఆర్‌ఐ తాటికొండ ప్రసాద్‌, ఎస్‌ఐ సుదర్శన  తదితరులు పాల్గొన్నారు.