తాండూరులో తాగునీటి కష్టాలు

ABN , First Publish Date - 2020-11-27T04:31:48+05:30 IST

తాండూరులో తాగునీటి కష్టాలు

తాండూరులో తాగునీటి కష్టాలు
బసవన్నకట్ట ప్రాంతంలో సొంతంగా ఫిల్టర్‌ నీటినిసరఫరా చేయిస్తున్న టీఆర్‌ఎస్‌నాయకుడు రఘు(ఫైల్‌)

  • 25రోజులుగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపివేత
  • ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టని మున్సిపాలిటీ
  • కాగ్నాలో పుష్కలంగా నీరున్నా ప్రజలకు అందని తాగునీరు

తాండూరు :  తాండూరు పట్టణంలో ప్రజలు 25 రోజులుగా తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పూర్తిగా మిషన్‌ భగీరథ నీటి సరఫరాపైనే ఆధారపడి ఉండటంతో పట్టణంలో నీటికష్టాలు ఎదురయ్యాయి. కల్వకుర్తి వద్ద మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాలో సమస్య ఎదురవడంతో గత కొన్నిరోజులుగా నీటి సరఫరా నిలిపివేశారు.   పట్టణంలో సుమారు 8వేల వరకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. తాండూరులో పాత పంప్‌హౌజ్‌ నుంచి నీటి సరఫరాకు చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అఽధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  కొన్ని రోజులుగా ప్రజల నుంచి వస్తున్న నిరసనలు, విపక్ష కౌన్సిలర్ల నిలదీత లతో పాలకవర్గం అధికారులు ఒక పాత పంప్‌హౌస్‌ వద్ద తాగునీటి సరఫరా పునరుద్ధరణ పనులు ముమ్మరం చేసి కొన్ని వార్డులకు మాత్రమే తాగునీరందిస్తున్నారు. కొత్త పంప్‌హౌస్‌ నుంచి సత్వరం పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరా చేస్తే అన్ని వార్డులకు నీరందే అవకాశం ఉంది. కొత్త పంప్‌హౌస్‌ నుంచి తాగునీటి సరఫరా ఇంకా పునరుద్ధరించడం లేదు. ఈసారి భారీ వర్షాలు కుర వడంతో కాగ్నాలో నీరున్నా పట్టణ ప్రజలకు తాగునీటిని అందించలేకపోతున్నారు.

Updated Date - 2020-11-27T04:31:48+05:30 IST