నీటి సంరక్షణ పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-06-12T05:12:53+05:30 IST

ఉపాధిహామీలో నీటి సంరక్షణ ప నులు చేపట్టాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు.

నీటి సంరక్షణ పనులు చేపట్టాలి

కలెక్టర్‌ శరత్‌
కామారెడ్డి, జూన్‌ 11: ఉపాధిహామీలో నీటి సంరక్షణ ప నులు చేపట్టాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని జనహిత భనంలో జరిగిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ కందకాలు, ఫాం పాండ్‌లు, ఊట చెరువులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని సూచించారు. వీటి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. గ్రామాల్లోని చెరువు లు, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని తెలిపారు. గ్రామాల్లో ఏడో విడత హరితహారం సందర్భంగా మొక్క లు నాటడానికి స్థలాలను ఎంపిక చేయాలని సూచించా రు. నర్సరీలను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాల న్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రో, డీఆర్‌డీఏ పీడీ వెంకట మాధవరావు, డీపీవో సున ంద, జడ్పీ సీఈవో సాయాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
హైవే వెంట ఐదు వరుసల్లో మొక్కలు నాటాలి
నేషనల్‌ హైవే రోడ్ల వెంట ఐదు వరుసల్లో మొక్కలు నాటాలని కలెక్టర్‌ శరత్‌ అఽధికారులను ఆదేశించారు. శుక్ర వారం జనహితభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ కింద రోడ్లకు ఇరువై పులా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొక్కల మధ్య ఉన్న గ్యాప్‌లో మీయావాకి తరహాలో మొక్కలు నాటాల ని, ఐదు వరుసలను ఫారెస్ట్‌ అధికారులు గుర్తించాలన్నా రు. ఏపీవో, టెక్నికల్‌ అసిస్టెంట్‌లతో కూడిన టీములు ఉపాధిహామీ కింద ఎస్టిమేషన్స్‌ వేయాలని, వచ్చే సోమ వారం సాయంత్రం లోగా శాంక్షన్స్‌ పొందాలని తెలిపారు. ఫారెస్ట్‌ అధికారులు పది ఫీట్ల కంటే తక్కువ కాకుండా మొక్కలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2021-06-12T05:12:53+05:30 IST