Watch: ఆహారం కోసం కారును తిప్పి వదిలిపెట్టిన ఏనుగు!

ABN , First Publish Date - 2022-09-23T02:04:19+05:30 IST

అడవులను యథేచ్ఛగా నరికేస్తూ వన్యప్రాణులకు ఆవాసాన్ని, ఆహారాన్ని మానవుడు దూరం చేస్తున్నాడు. ఫలితంగా అవి

Watch: ఆహారం కోసం కారును తిప్పి వదిలిపెట్టిన ఏనుగు!

న్యూఢిల్లీ: అడవులను యథేచ్ఛగా నరికేస్తూ వన్యప్రాణులకు ఆవాసాన్ని, ఆహారాన్ని మానవుడు దూరం చేస్తున్నాడు. ఫలితంగా అవి జనావాసాల్లోకి చొరబడి ఆహారం కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నాయి. కోతుల నుంచి పులల వరకు అన్నీ ఊర్ల మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో అవి కొన్నిసార్లు ప్రమాదాల్లో పడుతున్నాయి. మరికొన్నిసార్లు మనుషుల చేతుల్లోనూ హతమవుతున్నాయి. తాజాగా, ఇలాగే రోడ్డు మీదకు వచ్చిన ఓ ఏనుగు ఆహారం కోసం కలియదిరిగింది. పార్క్ చేసిన ఓ కారువద్దకు వెళ్లి దాంట్లో ఏమైనా దొరకుతుందోమోనని ఆశగా వెతికింది. నిజానికి ఏనుగులు (Elephants) సాధు జంతువులు. కానీ వాటికి కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 


ఇక్కడ ఇదే జరిగింది. పార్క్ చేసిన హ్యుందయ్ శాంత్రో (Hyundai Santro) కారులో ఆహారం కోసం వెతికిన ఏనుగు లాక్ చేసి ఉండడంతో తొండంతో దానిని విరగ్గొట్టే ప్రయత్నం చేసింది. ప్రయత్నం ఫలించకపోవడంతో దానిని బొమ్మకారులా గిరిగిరా తిప్పేసింది. అది చూసిన జనం భయంతో అరవడంతో ఏనుగు అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గువాహటి (Guwahati)లోని నారంగి మిలటరీ స్టేషన్‌ వద్ద జరిగిందీ ఘటన.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో షేర్ అయింది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. ఆ కారును ఏనుగు బొమ్మకారులా తిప్పేసిందని ఒకరంటే.. ఆ ఏనుగు ఎంత తెలివైనందంటే కారును గిరగిరా తిప్పి దాని పూర్వస్థానానికి తెచ్చిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కారు, డోర్లు విండోలు క్లోజ్ చేసినా సరే వాటిలో ఎలాంటి ఆహార పదార్థాలు ఉంచొద్దని మరో యూజర్ రాసుకొచ్చాడు.  



Updated Date - 2022-09-23T02:04:19+05:30 IST