కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-01-29T05:43:54+05:30 IST

కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని పట్టణ సీఐ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా మైక్‌ల ఏర్పాటు పనులను పరిశీలించి, మాట్లాడారు.

కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలి
క్యాలెండర్లు ఆవిష్కరిస్తున్న సీఐ ఆంజనేయులు

సూర్యాపేటటౌన్‌, జనవరి 28 : కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని పట్టణ సీఐ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా మైక్‌ల ఏర్పాటు పనులను పరిశీలించి, మాట్లాడారు.  కార్యక్రమంలో పట్టణ పడిశాల శ్రీనివాస్‌, ఏఎస్‌ఐ, ఐడీ పార్టీ సిబ్బంది కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట సౌండ్స్‌, లైటింగ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను సీఐ ఆంజనేయులు, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ పుట్ట కిషోర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చీకూరి అశోక్‌, ఉపాధ్యక్షుడు దేశగాని ఉపేందర్‌, కోశాధికారి అజిత్‌కుమార్‌, సెక్రటరీ ఉపేందర్‌, సలహాదారుడు సూరారపు పద్మారావు, ప్రేమ్‌సాగర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-29T05:43:54+05:30 IST