సత్ప్రవర్తనతో మెలగండి

ABN , First Publish Date - 2021-07-26T04:52:26+05:30 IST

మాజీ నేరస్థులంతా సత్ప్రవర్తనతో మెలగాలని కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామి రెడ్డి కోరారు. ఆదివారం తన కార్యాలయంలో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు రూరల్‌ ప్రాంతంలో ఉన్న మాజీ నేరస్థులతో సమావేశం నిర్వహించారు.

సత్ప్రవర్తనతో మెలగండి
మాట్లాడుతున్న డీఎస్పీ శివరామిరెడ్డి

పలాస: మాజీ నేరస్థులంతా సత్ప్రవర్తనతో మెలగాలని  కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామి రెడ్డి కోరారు. ఆదివారం తన కార్యాలయంలో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు రూరల్‌ ప్రాంతంలో ఉన్న మాజీ నేరస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా రౌడీషీట్‌ తెరుస్తామని హెచ్చరించారు. సెటిల్‌మెంట్లు, దందాలు, భూ తగాదాల్లో తలదూర్చవద్దన్నారు. కార్యక్రమంలో సీఐ ఎస్‌.శంకరరావు పాల్గొన్నారు.


మహిళా రక్షణలో ‘దిశ’ యాప్‌ కీలకం

టెక్కలి రూరల్‌: ఆపద సమయంలో మహిళల రక్షణకు దిశ యాప్‌ కీలకమని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక ఆదిత్య కల్యాణ మండపంలో ఆదివారం గ్రామ సచివాలయ మహిళా పోలీ సులు, గ్రామ వలంటీర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రతీ ఒక్క మహిళా దిశ యాప్‌ కలిగి ఉండేలా చర్యలు తీసు కోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఐలు ఎన్‌.కామేశ్వరరావు, గోపాలరావు, రవికుమార్‌ పాల్గొన్నారు.  


యాప్‌ను సద్వినియోగం చేసుకోండి

 సంతబొమ్మాళి: ‘దిశ’ యాప్‌ మహిళల పాలిట వరమని సంతబొమ్మాళి ఎస్‌ఐ ఎం.గోవింద అన్నారు. ఆదివారం నరసాపురంలో మహిళలకు ఈ యాప్‌పై అవగహన కల్పించారు. ప్రతి మహిళ మొబైల్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఆపత్కాలంలో వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దుక్క భూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2021-07-26T04:52:26+05:30 IST