వేతనాల కోసం ఏడు నెలలుగా ఎదురుచూపు

ABN , First Publish Date - 2022-05-25T05:24:28+05:30 IST

పాడి రైతులకు క్షేత్రస్థాయిలో ఎల్లవేళల అందుబాటులో ఉండే గోపాలమిత్రలకు ఏడు నెలలుగా గౌరవవేతనం అందకుండా పోతోంది. పాడి పశువులు, గొర్రెలు, మేకలకు గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు.

వేతనాల కోసం ఏడు నెలలుగా ఎదురుచూపు
గోడు వెళ్లబోసుకుంటున్న గోపాలమిత్రలు

ఆందోళనలో గోపాలమిత్రలు


మడకశిర రూరల్‌, మే 24: పాడి రైతులకు క్షేత్రస్థాయిలో ఎల్లవేళల అందుబాటులో ఉండే గోపాలమిత్రలకు ఏడు నెలలుగా గౌరవవేతనం అందకుండా పోతోంది. పాడి పశువులు, గొర్రెలు, మేకలకు గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు. పశువైద్యశాలలో డా క్టర్‌ ఉన్నా, లేకపోయినా గ్రామస్థాయిలో వెళ్లి పశువులకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. అయితే సమస్యలు పరిష్కరించడంలో ప్రభు త్వం ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మండ లంలోని బుళ్ళసముద్రం, ఆమిదాలగొంది, ఆర్‌ అనంతపురం, మణూరు, సీ కొడిగేపల్లి, తురుకువాండ్లపల్లి, గోవిందాపుం, హరేసముద్రం, పత్తికుంట, కదిరేపల్లి గ్రామాల్లో గోపాలమిత్రలు ఏళ్లకా లంగా విధులు నిర్వహిస్తున్నారు. 


మండలంలో 11 వేల పాడిపశువులు, గేదెలు, లక్ష వరకు గొర్రెలు, మేకలు ఉన్నాయి. గోపాలమిత్రలు గ్రామాలకు వెళ్లి పశువులు, గొర్రెలు, మేకలకు ప్రథమ చికిత్స చేస్తున్నారు అంతేకాకుండా పాడి రైతులకు పశు సంరక్షణ, పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ఏడు నెలలుగా గౌరవ వేతనాలు అందక  తీవ్ర ఇబ్బందుపడుతున్నారు. ప్రభు త్వం పట్టించుకోవడం లేదని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ తమ గోడు విని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.


పాడి పశువులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం

 - రామాంజనేయులు, ఆమిదాలగొంది, గోపాలమిత్ర

పదహారేళ్లుగా గోపాలమిత్రగా పనిచేస్తున్నా. గ్రామస్ధాయిలో పాడి పశువులకు మె రుగైన సేవలు అందిస్తున్నా. ప్రభుత్వం ఇ స్తున్న రూ.6500 అతి తక్కువ గౌరవవేత నం కూడా ఏడు నెలలుగా ఇవ్వడంలేదు. కుటుంబ పోషణ కష్టంగా మారింది. సకాలంలో వేతనాలు అందిస్తే మరింత ఉత్సాహంతో రైతులకు సేవలు అందిస్తాం.


ఉద్యోగ భద్రత కల్పించాలి

 - నాగరాజు, బుళ్ళసముద్రం, గోపాలమిత్ర

ఎన్నోఏళ్లుగా గోపాలమిత్రగా పనిచేస్తున్నాం. అయితే ఉద్యోగ భద్రత లేక ఇ బ్బందులు పడుతున్నాం. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. వేతనాలు పెంచి, చేసిన పనికి ప్రోత్సాహకా లు అందించాలి. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని చిరుద్యోగులకు మరింత వేతనాలు పెంచి ఆదుకోవాలి.


Updated Date - 2022-05-25T05:24:28+05:30 IST