డేటా ఎంట్రీ ఆపరేటర్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-31T08:42:30+05:30 IST

మండల విద్యాశాఖ కార్యాలయంలో పన్నెం డేళ్లుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోట

డేటా ఎంట్రీ ఆపరేటర్‌పై చర్యలు తీసుకోవాలి

జియ్యమ్మవలస, అక్టోబరు 30: మండల విద్యాశాఖ కార్యాలయంలో పన్నెం డేళ్లుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోట రామారావు పై చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రాంతంలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శుక్రవారం మండలంలోని పీటీ మం డ, పాండ్రసింగి, రామభద్రపురం, నడిమిసిరిపి గ్రామాల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న పథకం బిల్లులు జరిగే సమయంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 30 వేలు చొప్పున రామారావు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, జగనన్న విద్యా కానుక పుస్తకాలు, ఇతర పుస్తకాలను వేల సంఖ్యలో ఒక గదిలో ఉంచి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి రామారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీ ఎం నాయకులు కొల్లి గంగునాయుడు, కూరంగి సీతారాం, ఎండీఎం నిర్వాహకులు సన్యాసమ్మ, సరోజనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T08:42:30+05:30 IST