కన్వర్జెన్సీ పనులు వేగవంతం

ABN , First Publish Date - 2020-10-27T09:13:58+05:30 IST

జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న కన్వర్జెన్సీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు.

కన్వర్జెన్సీ పనులు వేగవంతం

విజయనగరం (ఆంధ్రజ్యోతి)  అక్టోబరు 26 : జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న    కన్వర్జెన్సీ పనులు వేగవంతం  చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌  ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో  సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ..  సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, ఆర్‌బీకే, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  నిర్ణీత రుసుం చెల్లించి జిల్లాలో 8,300 టన్నుల మేర సీజ్‌చేసిన ఇసుకను ప్రభుత్వ పనులకు వినియోగించాలని సూచించారు. సర్కార్‌ నిర్ణయించిన ధరకే స్థానికంగా సిమెంట్‌ను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. 


స్పెషల్‌ ఆఫీసర్లు  సచివాలయా లను దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు.  జిల్లాలో  కొవిడ్‌  కేసుల సంఖ్య నవంబరు -14 నాటికి జీరోగా మారాలన్నారు. భోగాపురం విమనాశ్రయం ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జగనన్న పచ్చతోరణం విషయం లో అటవీశాఖ ఈ నెలాఖరులోగా లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు.  జేసీలు కిషోర్‌కుమార్‌, వెంకటరావు, డీఎంఅండ్‌హెచ్‌వో రమణకుమారి, డీఆర్‌వో గణపతిరావు, సీపీవో విజయలక్ష్మి, డీపీవో సునీల్‌ రాజ్‌కుమార్‌, డ్వామా పీడీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఫ అంగన్‌వాడీ పోస్టులకు ఈనెల 29 నుంచి కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కలెక్టర్‌  తెలిపారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, భోగాపురం, విజయనగరం (అర్బన్‌), గంట్యాడ పరిధిలో పోస్టులకు  29న ఉదయం 10 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకూ ఇంటర్య్వూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 31న సాలూరు, గజపతినగరం, వియ్యంపేట, ఎస్‌.కోట, బొబ్బిలి రూర ల్‌, అర్బన్‌, బాడంగి పరిధిలో  పోస్టులకు  ఇంటర్వ్యూలు జరుగు తాయన్నారు.  ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. 

Updated Date - 2020-10-27T09:13:58+05:30 IST