Abn logo
Oct 2 2020 @ 04:06AM

రక్తదానం సామాజిక బాధ్యత : డీఎంహెచ్‌వో

Kaakateeya

విజయనగరం రింగురోడ్డు/బొబ్బిలి: రక్తదానం సామాజిక బాధ్యత అని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రమణకుమారి తెలిపారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్స వం సందర్భంగా గురువారం ప్రముఖ రక్తదాత బొడ్డేపల్లి రామకృష్ణారావు,  బొబ్బిలికి చెందిన అవేర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ పెద్దింటి మనోజ్‌కుమార్‌ (బాబీ)ని  సన్మానించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని,  అపో హలు విడనాడాలని కోరారు. తమ ఫౌండేషన్‌ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహి స్తున్నట్లు మనోజ్‌ తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రవికుమార్‌, ఏపీ ఎయిడ్స్‌ నియంత్రణ శాఖ జిల్లా మేనేజర్‌ బాలాజీ, సూపర్‌వైజర్‌ ఎస్‌.గోపాల్‌ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement