చిన్న,సన్నకారు రైతులకు వరం

ABN , First Publish Date - 2020-09-29T12:06:54+05:30 IST

రైతులకు ‘వైఎస్సార్‌ జలకళ’ పథకం వరమని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

చిన్న,సన్నకారు రైతులకు వరం

బోర్లు తవ్వేందుకు తొమ్మిది రిగ్గులు

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌


విజయనగరం (ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 28 : రైతులకు ‘వైఎస్సార్‌ జలకళ’ పథకం వరమని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వర్షాధార, మెట్టు ప్రాంతాలు అధికమన్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ జలకళ పథకం ఎంతో ప్రయోజనకరమని చెప్పారు.


జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకుగాను బోర్లు తవ్వేందుకు తొమ్మిది రిగ్గులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుండడం హర్షించదగ్గ పరిణామమన్నారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బోర్లు తవ్వేందుకు నియోజకవర్గాలకు కేటాయించిన రిగ్గు వాహనాలను ఎంపీ బెల్లాన, కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ జెండా ఊపి ప్రారంభించారు.


కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలసర్సయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు, జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) జె.వెంకటరావు, ఆసిస్టెంట్‌ కలెక్టర్‌ కె.సింహాచలం, డ్వామా పీడీ అయితా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T12:06:54+05:30 IST