ఉక్కు పరిరక్షణకు ప్రజా ఉద్యమం

ABN , First Publish Date - 2021-04-13T06:16:16+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే దాన్నే నమ్ముకుని బతికే వేలాది కుటుంబాలు ఎలా బతకాలని, కార్మికులు అంతా గొంతెత్తి ఐక్యంగా ఉద్యమించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు అన్నారు.

ఉక్కు పరిరక్షణకు ప్రజా ఉద్యమం
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగులు

పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు

60వ రోజు కొనసాగిన దీక్షలు

కూర్మన్నపాలెం, ఏప్రిల్‌ 12: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే దాన్నే నమ్ముకుని బతికే వేలాది కుటుంబాలు ఎలా బతకాలని, కార్మికులు అంతా గొంతెత్తి ఐక్యంగా ఉద్యమించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు అన్నారు. విశాఖ ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 60వ రోజు కూడా కొనసాగాయి. బుధవారం ఈ నిరాహార దీక్షల్లో ఎస్‌ఎంఎస్‌-2 కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు కె.సత్యనారాయణరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కారుచౌకగా ప్రజా సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నదని ఆరోపించారు.  పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టాలని కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పావులు కదుపుతున్నదని ఆరోపించారు. మరో నాయకుడు మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ  విశాఖ ఉక్కుతో పాటు కీలక పరిశ్రమలను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడమే దేశభక్తా అని కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. ఈ దీక్షలలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T06:16:16+05:30 IST