Abn logo
Feb 22 2020 @ 05:13AM

మా అభివృద్ధిని అడ్డుకోవద్దు

మావోయిస్టు ఈస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ లేఖకు కౌంటర్‌

చింతపల్లిలో అల్లూరి ఆదివాసీ అభివృద్ధి సమితి పేరిట కరపత్రం


చింతపల్లి, ఫిబ్రవరి 21 : మన్యాన్ని వీడండి.. మా అభివృద్ధిని అడ్డుకోవద్దంటూ చింతపల్లి పంచాయతీలో సీపీఐ మావోయిస్టు ఈస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ లేఖకు కౌంటర్‌గా అల్లూరి ఆదివాసీ అభివృద్ధి సమితి పేరిట కరపత్రాలు వెలిశాయి.ఆర్టీసీ కాంప్లెక్స్‌,హనుమాన్‌ జంక్షన్‌, ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం ఉదయం వీటిని అంటిం చారు. ఆదివాసీ చట్టాలు, హక్కుల పరిరక్షణ కోసం ప్రజల ఆందోళనలకు మావోయిస్టు పార్టీ మద్దతిస్తున్నట్టు ప్రకటించడం అభినందనలు, మీ మద్దతులో కపట ప్రేమ కనిపిస్తుంది, దొంగే, దొంగా.. దొంగా అన్నట్టు ఉందని అందులో పేర్కొన్నారు. మీ ఆధిపత్యం కోసం మా జీవితాలను బుగ్గిపాలు చేశారు. ఒకనాడు సాగులు, బూసులు, మొన్న మీరవరం, నిన్న జంతురాయిలో గిరిజనులపై నరమేధం ఏమిటి చెప్పండి. మన్యంలో సుమారు 200 మంది గిరిజన సోదరులను చంపారు. ఒక చిన్న చీటీపై ఇన్‌ఫార్మర్‌ అని రాస్తున్నారు. అనేక గ్రామాల నుంచి గిరిజనులను వెళ్లగొట్టారు. ఇదేనా గిరిజనులకు మీరిచ్చే మద్దుతు అని ప్రశ్నించారు . మీ వల్ల గ్రామాలకు రోడ్లు లేవు, బస్సుల్లేవు, సెల్‌ టవర్లు లేవు, అంబులెన్సులు రావు, పాఠశాలలు కూడా లేవన్నారు. మీ మనుగడ కోసం, మీ మోసపూరిత మాటలు నమ్మడం కోసం మా పిల్లలను బలి పశు వులను చేస్తున్నాం. ముందు మీరు మారండి, మీ మద్దతుమాకు వద్దు అని కరపత్రాల్లో పేర్కొన్నారు.

Advertisement