మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2021-12-04T05:46:15+05:30 IST

మంత్రి అప్పలరాజు వీఆర్వోలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మలపూడి సుధాకర్‌ చౌదరి అన్నారు.

మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలి
తణుకు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్వోల ఆందోళన

వీఆర్వోల  నిరసన

తణుకు, డిసెంబరు 3: మంత్రి అప్పలరాజు వీఆర్వోలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని  గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మలపూడి సుధాకర్‌ చౌదరి అన్నారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నల్ల బాడ్జీలు  ధరించి నిరసన  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ శుక్రవారం నుంచి వీఆర్వోలంతా తహసీల్దార్‌ కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తామన్నారు. తమకు సంబంధం లేని శాఖ అయి నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఓటీఎస్‌ విధులు నిర్వహిస్తున్నామని,  పలాస కమిషనర్‌ మాటలు విని వీఆర్వోలను తరిమి కొట్టండి అని మంత్రి పిలుపుని వ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, తప్పుడు అబియోగం చేసిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  పలువురు వీఆర్వోలు పాల్గొన్నారు.

గణపవరం:  మంత్రి అప్పలరాజు, పలాస మున్సిపల్‌ కమిషనర్‌ గోపాల రావు వీఆర్వోలకు క్షమాపణ చెప్పాలని శుక్రవారం గణపవరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్వోలు నిరసన తెలిపారు.   గణపవరంలో వీఆర్వోలు సచివాలయాల్లో విధులను బహిష్కరించి తహసీల్దార్‌ కార్యాలయంలో మాత్ర మే తమ విధులను నిర్వహించారు. మండల  సంఘం అధ్యక్షుడు నిడమర్తి కేశవమూర్తి మాట్లాడుతూ మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే  ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీఆర్వోల సంఘం కార్యదర్శి శ్రీకాంత్‌ బాబు, కోశాధికారి అనూష, వీఆర్వోలు వేణుగోపాల్‌, ఆకుల రాజేంద్ర ప్రసాద్‌బాబు, చంద్రశేఖర్‌  తదితరులు పాల్గొన్నారు. 

భీమడోలు: మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా భీమడోలు మం డల వీఆర్వోల సంఘం నిరసన తెలిపింది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి  మంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకో వాలని నినాదాలు చేశారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కేడీవీ ప్రసాద్‌, వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T05:46:15+05:30 IST