Advertisement
Advertisement
Abn logo
Advertisement

నల్లబ్యాడ్జీలతో వీఆర్వోల నిరసన


మార్కాపురం, డిసెంబరు 2 : వీఆర్వోలు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు వీఆర్వోలు సచివాయంలోకి వస్తే తరిమి కొట్టాలని చేసిన అనుచిత వ్యాఖ్యలపై వీఆర్వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసకు దిగిన వీఆర్వోలు మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ  నినాదాలు చేశారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం డివిజన్‌ నాయకులు బడే సాహెబ్‌, వీఆర్వోలు పాల్గొన్నారు. 

మంత్రి వ్యాఖ్యలకు ఖండన

పొదిలి :  మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆ ర్వోలు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు.  కార్య క్రమంలో వీఆర్వో కె.సుబ్బారావు, మురళి, అ బ్దుల్‌ రెహమాన్‌, సుబ్బయ్య, షబ్బీర్‌, సురేష్‌, బాలవెంకటరెడ్డి, అనిల్‌కుమార్‌, పూజిత, వెలి గొండయ్య, శేషాచలం, దుర్గాప్రసాద్‌ పా ల్గొన్నారు.

అనుచిత వ్యాఖ్యలు తగదు

గిద్దలూరు టౌన్‌ :  మంత్రి అప్పలరాజు సచివాలయాలకు వీఆర్వోలు వస్తే తరిమికొట్టా లంటూ  అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వీఆర్వోలు మండిపడ్డారు. తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట నల్లబ్యాడ్జీలతో వారు నిరసన తెలిపారు. కార్యక్రమంలో వీఆఆర్వోల సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరామయ్య, మండల వీఆర్వోలు పాల్గొన్నారు. 

కంభంలో దీక్ష 

కంభం  :  మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్వోలు నిరసనకు దిగారు.  వీఆర్వోల సం ఘ మండల అధ్యక్ష, కార్యదర్శులు  దాదాపీరా, అనూష మాట్లాడుతూ పాలకులకు  సహకా రంగా సేవలందిస్తుంటే ఆఆర్వోలను కించ పరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. అనం తరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.  ఉపాధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌, సహాయ కార్యదర్శులు ప్రసాద్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

బి.పేటలో నిరసన 

బేస్తవారపేట : మార్కాపురం వీఆర్వోల సం ఘ అధ్యక్షుడు చింతకుంట సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో బి.పేట తహసీల్దార్‌ ఆఫీస్‌ వద్ద  వీఆర్వోలు నిరసన చేపట్టారు. మంత్రి వైఖరిని వారు తప్పుబట్టారు. 

వైపాలెంలో ఆందోళన

ఎర్రగొండపాలెం :  మంత్రి అనుచిత వాఖ్యలను వ్యతిరేకిస్తూ వైపాలెం తహసీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట మండల వీఆర్వోలు నల్లబ్యాడ్జీలతో ఆం దోళనకు దిగారు. ఇలాంటి ఘటనలు పున రా వృతం కాకుండా మంత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు షేక్‌ నాసర్‌వలి, కార్యదర్శి  లక్ష్మిప్రసాద్‌, ఉపాధ్యక్షుడు దీనావలి, కోశాధికారి టి చెన్న కిష్ణయ్య,వి ఆర్వోలు పి చెన్నయ్య, యు కోటేశ్వరరావు, పోతులూరయ్య మరికొందరు విఆర్వోలు పాల్గొనినల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

భగ్గుమన్న వీఆర్వోలు

త్రిపురాంతకం :  మంత్రి అప్పలరాజు వ్యా ఖ్యలపై వీఆర్వోలు భగ్గుమన్నారు. తహసీల్దారు కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.  ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా అహర్నిశలు శ్రమిస్తున్న వీఆర్వోలపై మంత్రి అనుచితంగా మాట్లాడడం సరికాదన్నారు. కార్యక్రమంలో మండల వీఆర్వోలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement