గళమెత్తిన వీఆర్వోలు

ABN , First Publish Date - 2020-10-02T08:56:58+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు కల్పించాలంటూ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ..

గళమెత్తిన వీఆర్వోలు

రంగంపేట, అక్టోబరు 1: తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు కల్పించాలంటూ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు రంగంపేట మండల వీఆర్వో లు తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. వీఆర్వోల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, బి.యేసయ్య ఆధ్వర్యంలో తహ శీల్దారు వై.జయకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సచివాలయాల్లో బయోమెట్రిక్‌ తొలగించాలని కోరారు.


తరచూ తహశీల్దారు, మండల కేంద్రాలకు పిలిచి సమావేశాలతో పాటు అక్కడే పనిచేయమనడంతో తమకు ఇబ్బంది కలుగుతోం దన్నారు. తమకు కూడా కంప్యూటర్‌ సదుపాయం కల్పిం చాలని, కరోనా బారిన పడి మరణించిన వారికి బీమా సౌకర్యం కల్పించాలని, గ్రేడ్‌-2 వీఆర్వోలకు నాలుగు నెలలుగా జీతాలు లేవని, వెంటనే చెల్లించడంతో పాటు ఇతర సమస్యలను వినతిపత్రంలో ప్రస్తావించారు.


కడియం: తమ డిమాండ్లను పరిష్కరించాలని కడియం మండల వీఆర్వోలు గురువారం తహశీల్దారు జి.భీమారావుకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో జగన్‌ ఇచ్చిన వాగ్ధానం నేటికీ అమలు కాలేదన్నారు. పదోన్నతుల విష యంలో తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా సర్క్యులర్‌ జారీ చేశారన్నారు. గ్రేడ్‌-2 వీఆర్వోగా కాకుండా స్కేలు వేతనంతో కూడిన వీఆర్వోగా, జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. వీఆర్వోల సంఘం మండల అధ్యక్షుడు ఎ.రాజశేఖర్‌, కార్యదర్శి సీహెచ్‌ ఆదినారాయణ, డివిజన్‌ కార్యదర్శి కేబీ రామారావు (చందు) తదితరులు పాల్గొన్నారు. 


రాజమహేంద్రవరం రూరల్‌: స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద వీఆర్వోలు ధర్నా చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దారుకు అందజేశా రు. వివిధ గ్రామాల వీఆర్వోలు పాల్గొన్నారు. 


బిక్కవోలు: వీఆర్వోల సంఘ మండల అధ్యక్షుడు మహ్మద్‌ రజా మండలంలోని వీఆర్వోలతో కలిసి తహశీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం తహశీల్దారు మాధవరావుకు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి శ్రీదేవి, కోశాధికారి శివకుమార్‌, వీఆర్వోలు శ్రీనివాసచౌదరి, మురళీకృష్ణ, వీరబాబు, రామకృష్ణ, శ్రీనివాస్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.


అనపర్తి: మండలంలోని వీఆర్వోలు స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా   నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దారు రాజ్యలక్ష్మికి అందజేశారు. యూనియన్‌ అధ్యక్షుడు బండారు శ్రీను, కార్యదర్శి వేమగిరి సురేష్‌, చిర్రా వెంకన్నబాబు, మేకా శ్రీను పాల్గొన్నారు.


రంపచోడవరం: మండల పరిధిలోని వీఆర్వోలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ తహశీల్దారు కె.లక్ష్మీకళ్యాణికి వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ తహశీ ల్దారు పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


వరరామచంద్రాపురం: స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట వీఆర్వోలు ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లు, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దారు శ్రీధర్‌కు అందించారు. సంఘం డివిజన్‌ అధ్యక్షుడు పండా రామకృష్ణ, వీఆర్వోలు ఎం.నాగేశ్వరరావు, కరక జోగారావు, అనిగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-02T08:56:58+05:30 IST