ఓటరు ఉసూరు..!

ABN , First Publish Date - 2021-04-17T04:20:40+05:30 IST

రుపతి ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతోపాటు ఆ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పల్లెల్లో ఉంటూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.

ఓటరు ఉసూరు..!

 హోరాహోరీ ప్రచారంతో పెరిగిన ఆశలు

 తాయిలాల పంపిణీకి ముందుకురాని పార్టీలు

రాపూరు, ఏప్రిల్‌ 16: తిరుపతి  ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీగా  ప్రచారం చేశాయి. టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతోపాటు ఆ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పల్లెల్లో ఉంటూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. వైసీప్టీ ముఖ్యనేతలతోపాటు, ఉప ముఖ్యమంతులు, మంత్రులు విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ భారీగా ఉంటుందని జనం ఆశించారు.  గురువారం రాత్రి వరకూ రాపూరు మండలంలోని పల్లెల్లో ఇదే పరిస్థితి. శుక్రవారం ఉదయం నుంచి నేతలు ఓటరు స్లిప్పులతో, నగదు, మద్యం, కానుకలతో వస్తారని ఆశగా ఎదురుచూశారు. రాత్రి వరకూ ఒక్కరు కూడా తమ ఇళ్లకు రాకపోవడంతో ఏం జరుగుతుందోనని ఆరాలు తీయడం మొదలెట్టారు.  తాయిలాల నగదు, మద్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం లేదని తెలుసుకున్నారు. ఊరించి ఊరించి ఉసూరుమనిపించారంటూ ఒకే ఒక్కరోజులో సీన్‌ మారిపోయిందంటూ శాపనార్థాలు పెడుతున్నారు. మండలంలో ఇటీవల జరిగిన అన్ని ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో, నేతలను కొనుగోలు చేసి తమ నోటిలో మట్టి కొట్టాయని రాజకీయ పార్టీలను ప్రజలు విమర్శిస్తున్నారు. 

పంచాయతీపై ప్రభావం

రాపూరు మేజర్‌ పంచాయతీ సర్పంచు, 10 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 6వార్డులకు పోటీ జరిగింది. ఓటుకు నోటు ఇవ్వకపోవడంతో జనం ఓటు వేసేందుకు రాలేదు. దీంతో  అభ్యర్థులు ఓటుకు రూ.200 చొప్పున పంపిణీ చేశారు. దీంతో 50 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

గ్రామనేతలే భాగాలు వేసుకుని..

 అధినేతలు చేతులు ఎత్తివేయడంతో కొన్ని గ్రామాల్లో స్థానిక నేతలు చందాలు వేసుకుని ఓటుకు వంద రూపాయల వంతున చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది

Updated Date - 2021-04-17T04:20:40+05:30 IST