Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షానికి ఓటెయ్యం

- ప్రలోభాలకు గురికాకుండానే క్యాంపు

- తేల్చి చెప్పిన మంథని నియోజకవర్గ కాంగ్రెస్‌ పక్ష ప్రజాప్రతినిధులు

పెద్దపల్లి, డిసెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అభ్యర్థు లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటెయ్యబోమని, తమ డిమాండ్ల సాధన కోసం ఎంపీపీల ఫోరం కన్వీనర్‌ సారాబుడ్ల ప్రభాకర్‌ రెడ్డికి, ఇనుముల సత్యనారాయణకే ఓట్లు వేస్తా మని, క్యాంపు నిర్వహణపై కొందరు నిరాధారంగా చేస్తున్న ఆరోపణలను ఖండిస్తు న్నామని మంథని నియోజకవర్గ కాంగ్రెస్‌ పక్ష స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ఎడిషన్‌లో ‘కాంగ్రెస్‌ క్యాంపు రాజకీయా లు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. మహారాష్ట్ర సరిహద్దు సిరోంచలో క్యాంపులో ఉన్న కాటారం, మల్హర్‌, పలిమెల ఎంపీపీలు పంతకాని సమ్మ య్య, మల్హర్‌రావు, బుచ్చమ్మ, మహదేవ్‌పూర్‌, ముత్తారం, పలిమెల మండలాల జడ్పీటీసీ సభ్యులు అరుణ, శారద, హేమలతలు క్యాంపు నుంచి మాట్లాడిన వీడి యోరికార్డులను పత్రికలు, మీడియాకు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ అధి కార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగానే తమచే మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు క్యాంపు నిర్వహిస్తున్నారని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. తాము గెలిచినప్పటి నుంచి ప్రభుత్వం తమకు ఎలాంటి విధు లు, అధికాకాలను కట్టబెట్టకపోవడమే గాకుండా నిధులను కూడా విడుదల చేయ డం లేదన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మండల, జిల్లా పరిషత్‌లకు విడు దల చేస్తామన్నా రూ.500కోట్ల నిధులను విడుదల చేయలేదన్నారు. తమ హక్కు లు, డిమాండ్ల సాధన కోసం ఫోరం తరపున కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ ఎంపీపీ, ఫోరం కన్వీనర్‌ సారాబుడ్ల ప్రభాకర్‌ రెడ్డిచే నామినేషన్‌ వేయించామన్నారు. చట్టస భల్లో తమ గళం పిలించేందుకు అతడిని గెలిపించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఆ మేరకు అతడిని ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీకి నిలిపామన్నారు. మంథని నియోజక వర్గానికి చెందిన 40మంది ప్రజాప్రతినిధులం ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటు చేసు కున్నామన్నారు. ఈ క్యాంపు నిర్వహణకు శ్రీధర్‌బాబుకు ఎలాంటి సంబంధం లేద న్నారు. ఒక ఓటు సారాబుడ్ల ప్రభాకర్‌ రెడ్డికి, మరొక ఓటు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఇనుముల సత్యనారాయణకు వేస్తామని స్పష్టం చేశారు. దీంతో మంథని నియోజకవర్గ కాంగ్రెస్‌ ప్రతినిధులు నిర్వహిస్తున్న క్యాంపు నిర్వహ ణతో ఏర్పడ్డ గందరగోళానికి తెర పడింది. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కొం దరు ప్రజాప్రతినిధులు క్యాంపుకు వెళ్లినట్లు తెలుస్తున్నది. అయితే వాళ్లు ఎవరికి మ ద్దతుగా క్యాంపు నిర్వహిస్తున్నారనే విషయం తెలియడం లేదు. 

Advertisement
Advertisement