ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ సరికొత్త ఎత్తుగడ..!

ABN , First Publish Date - 2021-02-27T05:24:32+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల్లో వైసీపీ నాయకులు, అభ్యర్థులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ సరికొత్త ఎత్తుగడ..!

  • ఓటు.. అటు ఇటు 
  • ఓ డివిజన్‌ నుంచి మరో డివిజన్‌కు..
  • వైసీపీ అధికార దుర్వినియోగం
  • దొడ్డిదారిన అనుకూల వాతావరణాన్ని ఏర్పరుచుకుంటున్నవైనం


ఎలాగైనా విజయం సాధించాలి.. అందుకు ఏమి చేయడానికైనా సిద్ధమే.. చెప్పినట్లు చేసే అధికారులు ఉన్నారు.. ఇంకేమి. గుంటూ రు నగర పాలక సంస్థలో ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ సరికొత్త ఎత్తుగడ వేసింది. ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తోండటంతో చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని తమకు అనుకూలమైన వాతావరణాన్ని వైసీపీ అభ్యర్థులు దొడ్డిదారిన ఏర్పరుచుకుంటు న్నారు. డివిజన్ల వారీగా వ్యతిరేకులు.. సానుభూతిపరుల లెక్కన మార్పులు చేసుకుంటున్నారు. బూత్‌ల వారీగా వైసీపీ నాయకుల వద్దకు చేరిన జాబితాల ఆధారంగా ఓట్లను తమకు అనుకూలం గా మార్పులు చేయిస్తున్నారు. ఇలా మార్పులు జరిగే ఓటర్లలో ఎక్కువ భాగం జనసేన, బీజేపీ సానుభూతిపరులు కావడంతో  ఆ పార్టీ నాయకులు ఈ విషయాన్ని అధినేతల దృష్టికి తీసుకెళ్లారు. 



గుంటూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో వైసీపీ నాయకులు, అభ్యర్థులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఎన్నికల విభాగాల్లో కొంతమంది అధికారులు, ఉద్యోగులను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని వారికి కావాల్సిన విధంగా ఓటర్‌ జాబితాలను తయారు చేయిస్తోన్నారు. ఇప్పటికే పీడీఎఫ్‌ ఫైల్‌ రూపంలో పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలు వైసీపీ అభ్యర్థుల చేతికి చేరాయి. కాగా తమకు ఓటింగ్‌ తక్కువగా జరిగే ప్రాంతాల్లోని ఓటర్లను పక్క డివిజన్‌కు ఆ డివిజన్‌లోని వైసీపీ సానుభూతిపరుల ఓట్లని ఇటువైపునకు తారుమారు చేసేస్తోన్నారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని శ్రీనివాసరావుపేటలో ఏకంగా మూడు లైన్లలో వందల మంది ఓట్లు పక్క డివిజన్‌లోకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని గ్రహించిన జనసేన, బీజేపీ నాయకులు అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లని పక్క డివిజన్‌లోకి మార్పు చేయించి వేరే డివిజన్‌లోని తమ పార్టీ మద్దతుదారుల ఓట్లు తెచ్చి ఇక్కడ చేర్చుకొంటున్నారు. డివిజన్ల పునర్విభజన సమయంలోనూ ఇదే పంథాని అవలంభించారు. అప్ప ట్లో టీడీపీ, జనసేన, బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలను రెండు డివిజన్లలోకి విభజించారు. మరోపక్క వైసీపీకి బలంగా ఉన్న ప్రాంతాలను మాత్రం కదల్చకుండా అలానే ఉంచారు. దీని వలన తమ ప్రత్యర్థుల ఓట్లు చీలిపోయేలా చేస్తూ తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకొంటున్నారు.


వైసీపీ అభ్యర్థుల భవనాల్లోనే సచివాలయాలు ఉండటంతో...

గుంటూరు నగరంలో కొంతమంది వైసీపీ అభ్యర్థుల సొంత భవనాల్లోనే వార్డు సచివాలయాలు అప్పట్లో ఏర్పాటు చేశారు. వీటిపై అభ్యంతరాలు వచ్చినా అధి కారులు చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సంబంఽ దిత సచివాలయాల్లో పని చేసే వలంటీర్లంతా ఆయా అభ్యర్థుల ఎన్ని కల ప్రచారాల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొంతమంది వలంటీర్లు ఏకంగా వైసీపీ కండువాలు మెడలో వేసు కొని ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. వాటికి సం బంధించి ప్రత్యర్థులు ఫొటోలు చిత్రీకరించి నగరపాల కసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధకి కూడా వాట్సాప్‌, మెయిల్స్‌ ద్వారా పంపించారు. దీనిపై కమిషనర్‌ శుక్ర వారం సాయంత్రం జూమ్‌ కాన్ఫరెన్స్‌లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. వలంటీర్లని వార్డు సచివాలయ అధికారులు హెచ్చరిస్తోన్నా ఏమాత్రం లెక్క చేయడం లేదు. మాకేమి కాదు ఎన్నికలు అయిపోగానే అంతా మాదే అన్నట్లుగా వ్యవహరిస్తోన్నారు. 


 

Updated Date - 2021-02-27T05:24:32+05:30 IST