విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

ABN , First Publish Date - 2021-02-27T05:24:19+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), ఫిబ్రవరి 26: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర కార్మిక, ఉద్యోగ, దళిత సంఘాల ఆధ్వర్యాన కాకినాడ మెయిన్‌రోడ్‌ హెడ్‌ పోస్టాఫీసు వద్ద శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
కాకినాడలో రాస్తారోకో చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు

కాకినాడలో కార్మిక సంఘాల రాస్తారాకో

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), ఫిబ్రవరి 26: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర కార్మిక, ఉద్యోగ, దళిత సంఘాల ఆధ్వర్యాన కాకినాడ మెయిన్‌రోడ్‌ హెడ్‌ పోస్టాఫీసు వద్ద శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఐఎన్‌టీయూసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తాళ్లూరి రాజు, ఏఐసీసీటీయూ రాష్ట్ర నాయకుడు గుడాల సత్యనారాయణ, ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకుడు గుబ్బల ఆదినారాయణ, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మోనటరింగ్‌ కమిటీ సభ్యుడు అయితాబత్తుల రామేశ్వరరావు, ముస్లిం ఆలోచనాపరుల వేదిక జిల్లా కన్వీనర్‌ హసన్‌ మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉన్నందునే సామాజికంగా వెనుకబడినవర్గా లకు చెందిన ఐదు వేలమంది పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేస్తున్న అన్యాయానికి కాకినాడ ఎంపీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, పలు సంఘాల నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, పెద్దిరెడ్డి సత్యనారాయణ, టి.అన్నవరం, జి.లోవరత్నం, గదుల సాయిబాబు, పసుపులేటి వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, జోగా రాజు, రాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:24:19+05:30 IST