ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్లు
ABN , First Publish Date - 2022-01-08T05:30:00+05:30 IST
టెక్నాలజీతో దూసుకుపోతున్న నేటి తరం సెల్ ఫోన్ అనగానే గమనిస్తున్న వాటిలో ఫొటోలు తీసే విధానం కూడా ఒకటి. తీసిన ఫొటో లేదంటే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పదిమందితో షేర్ చేసుకోవడం నేటి ఫ్యాషన్. ఈ విషయంలో వివో మొదటి నుంచీ ముందు ఉంటోంది. ..
టెక్నాలజీతో దూసుకుపోతున్న నేటి తరం సెల్ ఫోన్ అనగానే గమనిస్తున్న వాటిలో ఫొటోలు తీసే విధానం కూడా ఒకటి. తీసిన ఫొటో లేదంటే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పదిమందితో షేర్ చేసుకోవడం నేటి ఫ్యాషన్. ఈ విషయంలో వివో మొదటి నుంచీ ముందు ఉంటోంది. మన దేశంలో తాజాగా విడుదల చేసిన వివో వి23 మొబైల్ ఫోన్‌లో మూడు కెమెరాలు ఉన్నాయి. 108 మెగా పిక్సల్స్ ప్రైమరీ, 8 మెగా పిక్సల్ అల్ర్టా వైడ్, 2 మెగా పిక్సల్ మేక్రో కెమెరాతో వస్తోంది. దీనిలో మీడియా టెక్ ప్రొసెసర్ అమర్చారు. 1080 ్ఠ 2400 పిక్సల్స్ రెజల్యూషన్ రీఫ్రెష్ రేట్, హెచ్‌డిఆర్10+ సపోర్ట్ చేస్తుంది. రెండోదైన వి23 5జిలో ఫాస్ట్ చార్జింగ్‌కుతోడు 64 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ అలా్ట్రవైడ్, 2 మెగాపిక్సల్ మేక్రో కెమెరా ఉన్నాయి. కలర్ చేంజబుల్ ఫ్లోరైట్ గ్లాస్ డిజైన్‌తో ఈ రెండూ మొదటిసారి మన దేశంలో అందుబాటులోకి రావడం విశేషం.