మేడ్చల్, జూలై 3: మేడ్చల్‌లో ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసం మొదటి ఆదివారం నిర్వహించే విష్ణు శౌర్య బోనాలను ఘనంగా నిర్వహించారు. సూర్యనగర్ కాలనీ నుంచి ఏడుగుళ్ల అమ్మవార్ల ఆలయాల వరకు పల్లకి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.