విధేయతకు పట్టం

ABN , First Publish Date - 2020-09-28T17:43:46+05:30 IST

తెలుగుదేశం పార్టీ కొత్తగా ప్రయోగం చేసిన పార్లమెంటరీ నియోజకవర్గాల..

విధేయతకు పట్టం

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షుల నియామకం

విశాఖకు పల్లా శ్రీనివాసరావు

అనకాపల్లికి బుద్ద నాగజగదీశ్‌

అరకుకు గుమ్మడి సంధ్యారాణి

కాకినాడ, అమలాపురం 

కో-ఆర్డినేటర్‌గా బండారు

శ్రీకాకుళం, విజయనగరానికి గణబాబు

విశాఖ, అనకాపల్లి సమయన్వయకర్తగా చినరాజప్ప


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కొత్తగా ప్రయోగం చేసిన పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షుల నియామకంలో విధేయత, నిబద్ధతకు అధినేత చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని, పార్టీని అంటిపెట్టుకుని వున్న వారికి పదవులు కట్టబెట్టారు. విశాఖ జిల్లాలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు వుండడంతో విశాఖకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లికి ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, అరకుకు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని అధ్యక్షులుగా నియమించారు.


తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వున్న జిల్లా కార్యవర్గాల స్థానంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు కొద్ది రోజుల నుంచి కసరత్తు జరుగుతోంది. తొలుత అఽధ్యక్ష పదవుల భర్తీ చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం ఆయా పేర్లు ప్రకటించారు. జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు పలువురి పేర్లను పరిశీలించారు. సామాజిక వర్గాలు, పార్టీ పట్ల విధేయత, నాయకత్వ లక్షణాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్షులను ఖరారు చేశారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షునిగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షునిగా ఎమ్మె ల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, అరకు పార్లమెంటరీ నియోజక వర్గం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి నియమితులయ్యారు. కాగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల టీడీపీ పగ్గాలు ఈ ముగ్గురికే అప్పగించే అవకాశం వుందంటూ 26వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే.


అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గని పల్లా

విశాఖపట్నం పార్లమెంటరీ అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి పల్లా సింహాచలం తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే వున్నారు. 1994 ఎన్నికల్లో విశాఖ-2 నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉన్నత విద్యావం తుడైన ఆయన కుమారుడు పల్లా శ్రీనివాసరావు తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించేవారు.



శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యంలోచేరి పక్క జిల్లాల్లో కో-ఆర్డినేటర్లుగా బండారు, గణబాబు తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి, పి.గణబాబులను అధిష్ఠానం ఇతర జిల్లాల్లోని పార్లమెంటరీ స్థానాలకు కో-ఆర్డినేటర్లుగా నియమించింది. కాకినాడ, అమలాపురం నియోజకవర్గాల కో-ఆర్డినేటర్‌గా బండారు సత్యనారాయణమూరి; శ్రీకాకుళం, విజయనగరం నియోజకవర్గాల కో-ఆర్డినేటర్‌గా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబును నియమించారు. కాగా విశాఖ, అనకాపల్లి నియోజకవర్గాల కో-ఆర్డినేటర్‌గా మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అరకుకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కోఆర్డినేటర్లుగా నియమితులయ్యారు. 


జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యం

మా పార్టీ అధినేత చంద్రబాబు గురుతర బాధ్యత అప్పగించారు. పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వ హిస్తూ అధినేత నమ్మకాన్ని నిలబడతా. నగరంలో పార్టీని మరింత పటిష్టం చేయడంతోపాటు జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం జయకేతనానికి కృషి చేస్తాను. కమిటీలో యువత, అను భవం, పార్టీ పట్ల విధేయత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. నేరచరిత్ర ఉన్నవారికి పదవులు ఇవ్వం. పార్టీలో అందర్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళతా.

- పల్లా శ్రీనివాసరావు, విశాఖ అధ్యక్షుడు


పార్టీని పటిష్టం చేస్తా

సీనియర్‌ నాయకులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారా యణమూర్తి తదితరుల సలహాలతో అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేస్తాను. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో కొనసాగుతున్న నాకు ప్రతి ఒక్కరితో అనుబంధం ఉంది. నాయ కులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారితో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాల్లో గెలిచేలా కృషి చేస్తాను.

- బుద్ద నాగజగదీశ్వరరావు, అనకాపల్లి అధ్యక్షుడు


ఏజెన్సీలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా

అరకులోయ ఎంపీ స్థానంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. అధినేత చంద్రబాబు నాయుడు నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ పదవిని బాధ్యతగా నిర్వహిస్తాను. పార్టీ పెద్దలతోపాటు కేడర్‌ను కలుపుకుని పార్టీని పటిష్టం చేస్తాను. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి శాయశక్తులా కృషి చేస్తాను. 

- గుమ్మడి సంధ్యారాణి,  అరకు అధ్యక్షురాలు


Updated Date - 2020-09-28T17:43:46+05:30 IST