ప్రియుడి కోసం Visakhaకు డ్రగ్స్... యువతి అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-31T14:09:04+05:30 IST

డ్రగ్స్‌ అక్రమ రవాణా చేస్తూ ఓ యువతి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడింది.

ప్రియుడి కోసం Visakhaకు డ్రగ్స్... యువతి అరెస్ట్

విశాఖపట్నం: డ్రగ్స్‌ అక్రమ రవాణా చేస్తూ ఓ యువతి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడింది. టాబ్లెట్‌ రూపంలో ఉన్న 18 పిల్స్‌, 2 ఎండీఎంఏను యువతి నుంచి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన యువతిని టాస్క్‌ఫోర్స్‌ అరెస్ట్‌ చేశారు. మర్రిపాలెం గ్రీన్‌ గార్డెన్స్‌కు చెందిన యువకుడు, హైదరాబాద్‌ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి కోసం యువతి డ్రగ్స్‌ను హైదరాబాద్‌ నుంచి విశాఖకు తీసుకొచ్చిన్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-31T14:09:04+05:30 IST