విశాఖలో అరబిందో కంపెనీ బస్సుకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-22T13:54:48+05:30 IST

విశాఖ గాజువాక ఆటోనగర్ వద్ద అరబిందో కంపెనీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజామున అరబిందో కంపెనీకి చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది

విశాఖలో అరబిందో కంపెనీ బస్సుకు తప్పిన ప్రమాదం

విశాఖపట్నం: విశాఖ గాజువాక ఆటోనగర్ వద్ద అరబిందో కంపెనీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజామున అరబిందో కంపెనీకి చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్ పైకి  దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను అదుపులోకి తీసువచ్చారు. 

Updated Date - 2020-10-22T13:54:48+05:30 IST