Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ: రిసార్ట్స్ కూల్చివేతపై టీడీపీ నిరసన

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. విశాఖ రుషికొండలో ఏపీటీడీసీ బీచ్ రిసార్ట్స్‌ను కూల్చివేస్తున్నారు. దీనిపై టీడీపీ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. కూల్చివేతలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో రూ. 91 కోట్లతో కొత్త రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్ల క్రితం రూ. 15 కోట్లతో ఈ రిసార్ట్స్‌ను నిర్మించారు. ఇది 60 గదులతో, రూ. 30 కోట్ల టర్నోవర్‌తో పలువురికి ఉపాధి లభిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం కూల్చివేయడంతో వారంతా ఉపాధి కోల్పోతున్నారని టీడీపీ నేతలతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement