అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

ABN , First Publish Date - 2021-06-11T15:36:37+05:30 IST

వాయువ్య బంగాళాఖాతం, ఒరిస్సా, గ్యాంగ్టక్ వెస్ట్ బెంగాల్‌ను ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది.

అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, ఒరిస్సా, గ్యాంగ్టక్  వెస్ట్ బెంగాల్‌ను ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల , తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్‌లో కూడా భారీ వర్షాలు కురువనున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Updated Date - 2021-06-11T15:36:37+05:30 IST