Visa Scam: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో Karti chidambaram పిటిషన్

ABN , First Publish Date - 2022-06-05T02:34:51+05:30 IST

చైనీస్ వీసా స్కామ్‌‌కు సంబంధించి ఈడీ తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్..

Visa Scam: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో Karti chidambaram పిటిషన్

న్యూఢిల్లీ: చైనీస్ వీసా స్కామ్‌‌కు సంబంధించి ఈడీ తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కార్తి పి.చిదంబరం శనివారంనాడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం నిరాకరించింది. దీంతో విచారణ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కార్తీ చిదంబరం హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై సోమవారంనాడు హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.


కార్తీ తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం 2011లో కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు 263 మంది చైనా పౌరులకు వీసాలు మంజూరు చేసిన కేసులో కార్తీ చిదంబరంతో పాటు పలువురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో సీబీఐ ఇటీవల ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకొని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.

Updated Date - 2022-06-05T02:34:51+05:30 IST