ప్రశ్నించడం రాజద్రోహమా?

ABN , First Publish Date - 2022-08-08T02:52:45+05:30 IST

ప్రశ్నించడం రాజద్రోహమా?, ప్రశ్నించిన వారందరూ రాజద్రోహులా అని విరసం నేత జీ.కల్యాణ్‌రావు ప్రశ్నించారు.

ప్రశ్నించడం రాజద్రోహమా?
మాట్లాడుతున్న కల్యాణ్‌రావు

విరసం నేత కల్యాణ్‌రావు

కావలిటౌన్‌, ఆగస్టు 7: ప్రశ్నించడం రాజద్రోహమా?, ప్రశ్నించిన వారందరూ రాజద్రోహులా అని విరసం నేత జీ.కల్యాణ్‌రావు ప్రశ్నించారు. ఆదివారం పట్టణంలోని షాదీమంజిల్‌లో విఫ్లవకెరటం గడ్డం కోటారెడ్డి 48వ వర్ధంతిని పురస్కరించుకుని అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. పౌరహక్కుల నాయకుడు, సీనియర్‌ న్యాయవాది కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య వక్తగా పాల్గొన్న కల్యాణ్‌రావు ప్రశ్నించడం నేరమా అనే అంశంపై  ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో తనకు గడ్డం కోటారెడ్డి స్ఫూర్తి అన్నారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కల్పించిన ప్రాఽథమిక హక్కు అని, ఆ హక్కును కాలరాయడమంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనా విధానాలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. బ్రిటీష్‌ పాలకులు మనదేశ స్వాతంత్ర సమరయోదులను అణచివేసేందుకు రాజద్రోహం చట్టం తెచ్చారని ఆ చట్టాన్ని ప్రశ్నించే దేశపౌరులపై ప్రయోగించడం దుర్మార్గమన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారని, గాంధేయవాదులుగా చెప్పుకునే కాంగ్రెస్‌, బీజేపీ పాలకులు రాజద్రోహం చట్టం ఇప్పటికీ రద్దు చేయకపోవడం దారుణమన్నారు. అనంతరం గడ్డం కోటారెడ్డి ఉద్యమ ప్రస్ధానంపై కృష్ణారెడ్డి చెంచయ్యలు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాయవాది కోటయ్య, డాక్టర్‌ అంకిరెడ్డి, చెంచయ్య, కృష్ణారెడ్డి, కోటారెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు .  

Updated Date - 2022-08-08T02:52:45+05:30 IST