Abn logo
Oct 19 2021 @ 21:53PM

Viral Video: ఈ కేక్‌ను చూస్తే.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

ఇంటర్నెట్ డెస్క్: రుచికరమైన కేక్ అంటే ఇష్టపడని వాళ్లు బహుశా ఉండరేమో. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కేక్‌ను చూస్తే మాత్రం.. తినడం అటుంచితే చాలా మందికి వెన్నులో వణుకు మొదలవుతుందేమో. ఏంటి ఏమైనా పిచ్చా.. కేక్‌ను చూసి ఎవరైనా భయపడతారా? అని అనుకుంటున్నారా... అయితే ఆలస్యం చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి.


చెఫ్‌ల నైపుణ్యం పుణ్యమా అని ప్రస్తుతం రకరకాల డిజైన్లతో మార్కెట్‌లో వందలాది కేకులు అందుబాటులో ఉన్నాయన్న విషయం తెలసిందే. ఈ క్రమంలోనే ఓ చెఫ్ తయారు చేసిన కేక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అచ్చం కొండ చిలువలా ఉండటమే ఆ కేక్ ప్రత్యేకత. పసుపు వర్ణంలో ఉన్న చిన్న కొండ చిలువ ముడుచుకుని ఉంటే.. ఎలా ఉంటుందో అదే తరహాలో ఓ వ్యక్తి కేక్‌ను తయారు చేశాడు. అంతేకాకుండా దాన్ని కత్తితో కట్ చేస్తూ ఆ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కొండ చిలువ ఆకారంలో ఉన్న ఆ కేకును చూసి నెటిజన్లు జడుసుకుంటున్నారు. ‘ఆ కేక్‌ను చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.. అటువంటిది దాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు.. ఎలా తింటారు’అంటూ కామెంట్ చేస్తున్నారు. 




ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...