Abn logo
Aug 4 2021 @ 00:43AM

తక్కెళ్లపాడులో విష జ్వరాలు!

సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న అధికారులు

ముగ్గురి మృతి 

 ఆలస్యంగా వెలుగులోకి ఫ అధికారుల పర్యటన..

జగ్గయ్యపేట రూరల్‌, ఆగస్టు 3 : తక్కెళ్లపా డులో డీఎంహెచ్‌వో సుహాసిని, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. రెండు రోజుల్లో వైరల్‌ ఫీవర్‌లతో ముగ్గురు మృతి చెందటంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో పర్యటించి సమీక్షించారు. శానిటేషన్‌, దోమల మందు పిచికారీ, తదితర చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పని చేసి జ్వరాలను కట్టడి చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. బూచవరం పీహెచ్‌సీ వైద్యా ధికారులు స్రవంతి, నాగరాణి ఆధ్వర్యంలో బుధవారం నుంచి వైద్య శిబిరం నిర్వహించాలన్నారు. తహసీల్దార్‌ రామకృష్ణ, ఎంపీడీవో జయచంద్ర, సర్పంచ్‌ శ్రీనివాసరావు, కార్యదర్శి సుబ్బారావు పాల్గొన్నారు. 


 ఆలస్యంగా వెలుగులోకి

గ్రామానికి చెందిన బాణావత్‌ సోమ్లానాయక్‌ (60), మమత (12) ఆదివారం మృతి చెందగా అగ్రికల్చర్‌ డిప్లమా రెండో ఏడాది చదువుతున్న రెమి డాల బాబు(18) సోమవారం మృతి చెందాడు. సమా చారం తెలుసుకున్న జిల్లా అధికారులు అప్రమత్తమై గ్రామానికి వచ్చి వివరాలను సేకరించారు. మీడియాకు కూడా  సమాచారం ఇవ్వలేదు. 


ఫీవర్‌ సర్వే తీరుపై ఎంపీడీవో ఆగ్రహం 

విస్సన్న పేట : మండలంలో జరుగుతున్న ఫీవర్‌ సర్వే తీరుపై ఎంపీడీవో ఎస్‌.వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో మంగళవారం కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో ఫీవర్‌ సర్వేపై సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు నామమాత్రంగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తు న్నారన్న సమచారంతో  ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. విస్సన్నపేట సచివాలయం-4, పుట్రేల సచివాలయం-1, తాతకుంట్ల సచివాలయాల ఏఎన్‌ఎంలు, వలంటీర్లకు మెమోలు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు.