Abn logo
Jul 31 2021 @ 00:39AM

గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దండి

సర్పంచుల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి

జీడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి


మదనపల్లె రూరల్‌, జూలై 30: గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచులదే అని జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక జడ్పీహైస్కూల్‌లో జరుగుతున్న సర్పంచుల శిక్షణ శిబిరంలో పాలనలో విధి విధానాలపై అవగాహన కల్పించారు.  సచివాలయ ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిధులను గ్రామాభివృద్ధికి ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయాలన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ పరిశీలకుడు శివశంకర ప్రసాద్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో అర్హులకు అందజేయడంలో సర్పంచులదే కీలకపాత్ర అన్నారు. ఎంపీడీవో లీలామాధవి, ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.