ఈ చదువుల తల్లి కోసం ఊరంతా తరలి వచ్చింది.. మేము చదివిస్తామంటూ చందాలు పోగేసి..

ABN , First Publish Date - 2022-04-16T22:42:02+05:30 IST

ఆ బాలిక పేద కుటుంబంలో పుట్టింది.. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుంది.. తల్లి రెక్కల కష్టంతోనే చదువు కొనసాగించింది..

ఈ చదువుల తల్లి కోసం ఊరంతా తరలి వచ్చింది.. మేము చదివిస్తామంటూ చందాలు పోగేసి..

ఆ బాలిక పేద కుటుంబంలో పుట్టింది.. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుంది.. తల్లి రెక్కల కష్టంతోనే చదువు కొనసాగించింది.. అయితేనేం.. పదో తరగతి పరీక్షల్లో బీహార్ బోర్డ్ టాపర్‌గా నిలిచింది.. అయితే పై చదువులు చదివేందుకు ఆమెకు ఆర్థిక కష్టాలు అడ్డువచ్చాయి.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమెకు అండగా నిలిచారు.. ఆమె ఆశయ సాధనకు గ్రామస్తులందరూ మద్దతు తెలిపారు. ఆమె చదువుకయ్యే ఖర్చు కోసం గ్రామస్తులందరూ చందాలు పోగేశారు. 


బీహార్‌లోని జెహానాబాద్‌కు చెందిన ప్రియాన్షు కుమారి అనే బాలిక బీహార్ బోర్డ్ పదో తరగతి పరీక్షలో 472 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ప్రియాన్షు పేదరికంతోనే చదువును కొనసాగించింది. ఎంతో కష్టపడి పదో తరగతిలో టాపర్‌గా నిలిచింది. అయితే ఆ పై చదువులు చదివేందుకు ఆమెకు అర్థిక స్థోమత లేదు. ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ బాలికకు మద్దతుగా నిలిచారు. 


సంతోష్ కుమార్ అనే మాజీ సైనికుడు ముందుగా ప్రియాన్షుకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఆ తర్వాత గ్రామానికి చెందిన ఇతరులు కూడా తోడ్పాటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందరూ కలిసి ఓ కమిటీలా ఏర్పడి చందాలు పోగేసి ప్రియాన్షు చదువుకయ్యే మొత్తాన్ని భరించేందుకు సిద్ధమయ్యారు. ప్రియాన్షు చదువు మొత్తం పూర్తయ్యే వరకు ఆమె బాధ్యత తమదేనని ప్రకటించారు. 

Updated Date - 2022-04-16T22:42:02+05:30 IST