కదం తొక్కిన గ్రామ రెవెన్యూ సహాయకులు

ABN , First Publish Date - 2022-08-20T05:37:47+05:30 IST

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కో సం గ్రామ రెవెన్యూ సహాయకులు జిల్లాలో కదం తొక్కారు.

కదం తొక్కిన గ్రామ రెవెన్యూ సహాయకులు
బోనాలతో ర్యాలీలో పాల్గొన్న మహిళలు

పే స్కేల్‌ జాతర పేరుతో భారీ ర్యాలీ ప్రదర్శన 

ప్రతిబింబించిన తెలంగాణ సంస్కృతి

జగిత్యాల అర్బన్‌, ఆగస్టు 19: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కో సం గ్రామ రెవెన్యూ సహాయకులు జిల్లాలో కదం తొక్కారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేస్కేల్‌ జాతర పేరుతో కా ర్యక్రమం నిర్వహించి తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి చాటి చెప్పారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వీఆర్‌ఏలు జిల్లా కేంద్రానికి తర లివచ్చారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట గల దీక్ష శిబిరం నుంచి పాత బస్టాండ్‌, తహసీల్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌ సర్కిల్‌ మీ దుగా కలెక్టరేట్‌ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు . పే స్కేల్‌ జాతర పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సం స్కృతి ప్రతిబింబించింది. పులి వేషాలు, బోనాలు, బతుకమ్మ, కోలాటం, జానపద నృత్యాలతో చేపట్టిన నిరసన ర్యాలీ అందరి దృష్టిని ఆకర్షించింది.  వీఆర్‌ఏల జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ తమ డిమాండ్ల సాథన కొసం 26 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం బాధాకరం అన్నారు. అర్హులందరికీ పదోన్నతి కల్పించాలని, 55 ఏళ్లు నిండిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలాగే వీఆర్‌ఏల ప్రధాన ఆకాంక్ష అయిన పే స్కేల్‌ జీవోను వెనువెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని, ప్రభు త్వం స్పందించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వా రు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వీఆర్‌ఏల జేఏసీ బాధ్యులు జిల్లాలోని వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:37:47+05:30 IST