‘నల్ల’ చట్టాలను రద్దుచేసే వరకు ఢిల్లీ పోరాటం ఆగదు

ABN , First Publish Date - 2021-10-19T05:05:27+05:30 IST

‘నల్ల’ చట్టాలను రద్దుచేసే వరకు ఢిల్లీ పోరాటం ఆగదు

‘నల్ల’ చట్టాలను రద్దుచేసే వరకు ఢిల్లీ పోరాటం ఆగదు
సెమినార్‌లో మాట్లాడుతున్న విజ్జు కృష్ణన్‌

రైతు ఉద్యమాన్ని అణిచివేస్తున్న మోదీని ఇంటికి పంపడం ఖాయం

అఖిలభారత కిసాన్‌ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజ్జు కృష్ణన్‌

కొత్తగూడెంలో మోదీ, అమిత్‌షా దిష్టిబొమ్మల దహనం

కొత్తగూడెం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు ఢిల్లీ రైతుల పోరాటం ఆగదని ఏఐకేఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్‌ విజ్జు కృష్ణన్‌ పేర్కొన్నారు. హింసతో రైతు ఉద్యమాన్ని అణిచివేసే ప్రధాని మోదీని ప్రజలు ఇంటికి పంపడం ఖాయమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌ నుంచి సీపీఎం, రైతు సంఘాల కార్య కర్తలు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం  బస్టాండ్‌ సెంటర్‌లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల దిష్టి బొమ్మలను దహనం చేశారు. అనంతరం కొత్తగూడెం క్లబ్‌లో తెలంగాణ రైతుసంఘం భద్రాద్రి జిల్లాకమిటీ ఆధ్వర్యంలో ‘భారత వ్యవసాయ రంగం -ప్రస్తుత సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో డాక్టర్‌ విజ్జు కృష్ణన్‌ ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లా డారు. ఐక్య పోరాటాలతో రైతు వ్యతిరేక చట్టాలను తిప్పి కొడతామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలతోపాటు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జోడించి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని రైతు నేతలకు సూచించారు. రైతు ఉద్యమం ఢిల్లీకి మాత్రమే పరిమితమైంది కాదని, ఇది దేశ వ్యాప్త మైందన్నారు. కేరళ మాదిరిగా ప్రత్యామ్నాయ పంటల కోసం 19రకాల పండ్లు, కూరగాయలకు ధరలు నిర్ణ యించి కేరళ వామపక్ష ప్రభుత్వం రైతులను ప్రోత్స హించిందని తెలిపారు. సదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్‌, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య మాట్లాడారు. సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు యలమంచిలి రవికుమార్‌, జిల్లా కార్యదర్శి కున్సోత్‌ ధర్మా, సీపీఎం జిల్లా నాయకులు జాటోత్‌ కృష్ణ, భూక్యా రమేష్‌,  రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, సందకురి లక్ష్మి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-19T05:05:27+05:30 IST