విజయవాడ: నగరంలో కనుమ సందడి నెలకొంది. ఆదివారం ఉదయం నుంచే నాటు కోళ్లు, వేటమాంసం కొనుగోలు చేసేందుకు దుకాణాలవద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. కనుమ పండుగ సందర్భంగా నాటుకోడి మాంసం కిలో రూ. 7 వందలకు అమ్ముతున్నారు. కాగా భోగి, సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. రెండు రోజుల పాటు ఆనందోత్సాహాలతో గడిపిన ప్రజలు మూడో రోజు కనుమ పండుగను విశిష్టంగా జరుపుకుంటున్నారు.